అశిష్-రాజు గారి ప్లాన్ అలా!
ఈ రెండు చిత్రాలు మాత్రం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా రాజుగారు బిజినెస్ స్ట్రాటజీ కనిపిస్తోందంటున్నారు.
By: Tupaki Desk | 22 Aug 2023 6:27 AM GMTఅగ్ర నిర్మాత దిల్ రాజు తమ్ముడు వారసుడిగా అశిష్ రెడ్డి 'రౌడీబోయ్స్' తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిం దే. తొలి సినిమాతోనే యంగ్ హీరో మంచి విజయం అందుకున్నాడు. ఇండస్ట్రీకి పనికొచ్చే కుర్రాడే అని నిరూపించుకున్నాడు. మొదటి సినిమా అయినా అనుభవం గల నటుడిలా కెమెరా ముందు పెర్పార్మ్ చేసాడు. అశిష్ ఎనర్జిటిక్ పెర్పార్మెన్స్ తో తొలి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు.
కుర్రాడి కి పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉందని ప్రశంసలందుకున్నాడు. ఇలా ఇన్ని ప్రశంసల వెనుక దిల్ రాజు కీ రోల్ పోషించారు అన్నది వాస్తవం. నిర్మాత అయిన దిల్ రాజు విషయాన్ని జడ్డ్ చేయడంలో ఆయన వెరీ స్పెషల్. పసిగట్టి పనివంతుల్ని వెతికి పట్టుకోవడంలో ఆయన దిట్ట. అలాంటిది తనయుడు విషయంలో ఇంకెంత కేర్ పుల్ గా ఉంటారో? చెప్పాల్సిన పనిలేదు. ఇలా అన్ని రకాలుగా అశిష్ కి ముందు నుంచి మంచి బ్యాకప్ ఉంది.
ప్రస్తుతం 'సెల్పీష్' అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కాశీ విశాల్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అషిశ్ కొత్త చిత్రం నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా సెల్పిష్ తరహాలోనే దిల్ రాజు బ్యానర్లోనే నిర్మాణం జరుగుతోంది. అయితే సెల్పిష్ రిలీజ్ కాకుండానే రాజుగారు కొత్త సినిమా ప్రారంభించడం ఏంటి? అని ఓ డిస్కషన్ సాగుతోంది.
సెల్పీష్ ఆలస్యానికి కారణాలు ఏంటి? అన్నది తెలియదు గానీ...ఈ రెండు చిత్రాలు మాత్రం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా రాజుగారు బిజినెస్ స్ట్రాటజీ కనిపిస్తోందంటున్నారు. ఇదే ఏడాది రెండు సినిమాలు ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేయాలని భావిస్తున్నారుట. 'సెల్పీష్' ముందు రిలీజ్ అవుతుందా? కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? అన్నది మరో డౌట్. రిలీజ్ ఏది అయినా రాజుగారు జడ్జిమెంట్ కి తిరుగుండదు. ఏ సినిమా హిట్ అవుతుందో గెస్ చేయగల నేర్పరి.
కాబట్టి ఆ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేసి అదే వేడిలో తర్వాత చిత్రాన్ని థియేటర్లోకి తెస్తారు. ఇది ఓ రకమైన బిజినెస్ స్ట్రాటజీ. తొలి సినిమా హిట్ అయితే రెండవ సినిమా ఎలా ఉన్నా మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి. మరి ఇలాంటి కారణంగా 'సెల్పీష్' ని మూడవ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెస్తారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.