Begin typing your search above and press return to search.

మరోసారి దిల్ రాజు పొలిటికల్ బజ్.. ఎలా సాధ్యం?

నిర్మాతగా పాన్ ఇండియా ఇమేజ్ కోసం దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అతను రాజకీయాలలోకి అడుగుపెడుతున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 3:41 AM GMT
మరోసారి దిల్ రాజు పొలిటికల్ బజ్.. ఎలా సాధ్యం?
X

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి దిల్ రాజు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ని తట్టుకొని నిలబడుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు తీసే నిర్మాతగా ఉన్నారు. ఆయన ప్రొడక్షన్ నుంచి ప్రతి ఏడాది అరడజను వరకు సినిమాలు వస్తూ ఉంటాయి. దీంతో పాటు డిస్టిబ్యూటర్ గా కూడా దిల్ రాజు బిజీగా ఉన్నారు.

స్టార్ హీరోల సినిమాల నైజాం రైట్స్ కొనుగోలు చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు. నిర్మాతగా, డిస్టిబ్యూటర్ గా దిల్ రాజుకి మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. దెబ్బలు తిన్నా కూడా వాటిని తట్టుకొని నిలబడ్డాడు. ప్రస్తుతం నిర్మాతగా దిల్ రాజు తన బ్రాండ్ ఇమేజ్ ని, ప్రొడక్షన్ వేల్యూస్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు. అందుకోసం పాన్ ఇండియా మూవీస్ పైన ఫోకస్ చేస్తున్నాడు.

ఇప్పటికే రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీ ఉంది. బాలీవుడ్ కి ప్రొడక్షన్ హౌస్ ని తీసుకెళ్లే పనిలో ఉన్నారు. నిర్మాతగా పాన్ ఇండియా ఇమేజ్ కోసం దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అతను రాజకీయాలలోకి అడుగుపెడుతున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబడానికి సిద్ధం అవుతున్నారంటూ టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఓ పార్టీతో దిల్ రాజుతో సంప్రదింపులు జరిపిందని, సీట్ కన్ఫర్మ్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దిల్ రాజు రాజకీయాలలోకి వెళ్తాడనే ప్రచారం చాలా కాలం నుంచి వినిపిస్తోంది. గతంలో ఓ సారి ఈ ప్రచారాన్ని అతను ఖండించారు.

నిజానికి దిల్ రాజుకి సినిమాలు అంటేనే ఇష్టం. ఒక ప్రొడ్యూసర్ గా దేశ వ్యాప్తంగా తన పేరు వినిపించాలని అనుకుంటున్నారు. అందుకే మార్కెట్ పరిధి పెంచుకుంటున్నారు. సినిమా వ్యాపారవేత్తగా మరింత పైకి ఎదిగే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలలోకి వెళ్తారని, ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ రాజకీయాలలోకి వెళ్తే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది కూడా ప్రశ్నగా ఉంది.