Begin typing your search above and press return to search.

'గేమ్‌ ఛేంజర్'.. దిల్ రాజు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారా?

శంకర్ కారణంగా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇంతవరకూ ప్రారంభం కాలేదు. సినిమా లేట్ అవ్వడతో దిల్ రాజుపై మరింత భారం పడిందనే టాక్ ఉంది.

By:  Tupaki Desk   |   18 July 2024 2:01 PM GMT
గేమ్‌ ఛేంజర్.. దిల్ రాజు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "గేమ్‌ ఛేంజర్". దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చెర్రీ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే అప్డేట్స్ రావడం లేదని నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు.. ఇప్పుడు 'భారతీయుడు 2' రూపంలో మరో షాక్ తలినట్లు అయింది.

'గేమ్‌ ఛేంజర్' కంటే ముందు శంకర్ సెట్స్ మీదకు తీసుకెళ్లిన సినిమా 'ఇండియన్ 2'. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మారింది. కలెక్షన్స్ చూస్తుంటే, ఇది శంకర్ కెరీర్ లోనే అతి పెద్ద పరాజయంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నిజానికి శంకర్ ఈ మధ్య కాలంలో ఫామ్ లో లేడు. రోబో తర్వాత ఆ స్థాయిలో సక్సస్ సాధించలేకపోతున్నారు. అయితే 'భారతీయుడు 2' సినిమాతో హిట్ కొట్టి దర్శకుడు మళ్ళీ ట్రాక్ లోకి వస్తారని మెగా ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే పొలిటికల్ సోషల్ డ్రామాస్ లో శంకర్ కు మంచి రికార్డ్ వుంది. 'గేమ్‌ ఛేంజర్' కూడా అదే జోనర్ లో తెరకెక్కుతోంది. కాబట్టి కచ్ఛితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది.

'ఇండియన్ 2' ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా శంకర్ పై ఎన్నడూ లేనన్ని విమర్శలు వస్తున్నాయి. ట్రేడ్ లో ఆయన క్యాలిబర్ మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా 'గేమ్‌ ఛేంజర్' బిజినెస్ పై ప్రభావం చూపిస్తుందేమో అని అభిమానులు కలవరపడుతున్నారు. శంకర్ కారణంగా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇంతవరకూ ప్రారంభం కాలేదు. సినిమా లేట్ అవ్వడతో దిల్ రాజుపై మరింత భారం పడిందనే టాక్ ఉంది.

ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే 'గేమ్‌ ఛేంజర్' సినిమా కంప్లీట్ అవుతుందని శంకర్ ఇటీవల మీడియాకి తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ జరిగే విధానాన్ని బట్టి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. అయితే శంకర్ ఈ మూవీ ఎడిటింగ్ పనులను చెన్నైలో నిర్వహిస్తారని టాక్ వినిపిస్తోంది. దీని వల్ల కంటెంట్ లో ఏమైనా చేంజెస్ చెప్పడానికి, నిర్మాత తన అభిప్రాయాన్ని పంచుకోడానికి అంతగా అవకాశం ఉండకపోవచ్చు.

మాములుగా దిల్ రాజు తన సినిమాల కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సీన్స్ నచ్చకపోతే రీషూట్స్ చేయిస్తారు. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరి, ఆయనకు సంతృప్తి కలిగే ఔట్ పుట్ వస్తేనే సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తారు. శంకర్ మాత్రం ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరని, తాను అనుకున్నదే చేస్తారనే టాక్ సినీ వర్గాల్లో ఉంది. 'భారతీయుడు 2' నిడివి విషయంలో ఇదే జరిగిందనే మాట వినిపించింది. 'గేమ్‌ ఛేంజర్‌' ఎడిటింగ్ లోనూ అలానే వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. అందుకే డైరెక్టర్ ఈసారి దిల్ రాజు, రామ్ చరణ్ ల జడ్జిమెంట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.