మరో కోలీవుడ్ హీరోతో దిల్ రాజు డీల్
ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో మూడో సినిమాకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 24 April 2024 4:36 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అటు మాతృభాషలో ఇప్పటికే టాప్ స్టార్ లలో ఒకడిగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలు లైన్ లో పెడుతూ తన మార్కెట్ పరిధిని పెంచుకునే పనిలో ఉన్నాడు. రఘువరన్ బీటెక్ మూవీతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యాడు. ఆ తరువాత ధనుష్ నుంచి వస్తోన్న తెలుగు డబ్బింగ్ సినిమాలకి ఆదరణ పెరిగింది.
వెంకీ అట్లూరి సార్ మూవీతో ధనుష్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తెలుగులో అతనికి ఫ్యాన్ బేస్, మార్కెట్ పెరిగింది. ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుభేర అనే మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూవీలో కింగ్ నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో మూడో సినిమాకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటి దిల్ రాజు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో వారిసు మూవీ చేసి హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా ధనుష్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. శ్రీకారం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన యంగ్ డైరెక్టర్ కిషోర్ చెప్పిన కథ దిల్ రాజుకి నచ్చింది. ఇదే కథని దర్శకుడు ధనుష్ కి వినిపించాడంట.
అతనికి మూవీ స్టోరీ, క్యారెక్టర్ వేరియేషన్స్ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసాడంట. నిజానికి నితిన్ హీరోగా కిషోర్ ఒక సినిమా ఒకే చేసుకున్నాడు. త్వరలోనే అది ప్రారంభం అవుతుందని ప్రచారం నడిచింది. ఇంతలో ధనుష్ హీరోగా సినిమా కన్ఫర్మ్ అయ్యింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ మూవీని ఎనౌన్స్ చేసి దసరాకి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
నితిన్ కి చెప్పిన కథనే కిషోర్ ధనుష్ కి నేరేట్ చేసి ఒకే చేయించుకున్నాడా లేదా కొత్త కథతో చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు కూడా ఇప్పటికే విజయ్ తో మూవీ చేసాడు. రెండో సినిమాని ధనుష్ తో చేస్తున్నాడు. దిల్ రాజు జాబితాలో ఇంకొంత మంది కోలీవుడ్ హీరోలు కూడా ఉన్నారని తెలుస్తోంది. వీలైనంత వరకు ఇతర భాషల్లో కూడా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోకాలం అనుకుంటున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.