Begin typing your search above and press return to search.

అక్క‌డా..ఇక్క‌డా హ్యాట్రిక్ క‌లిపితే డ‌బుల్ హ్యాట్రిక్!

బాల‌య్య లాంటి మాస్ హీరో దొరికితే అత‌డి కంటెంట్ పీక్స్ కి వెళ్లిపోతుంది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 11:30 AM GMT
అక్క‌డా..ఇక్క‌డా హ్యాట్రిక్ క‌లిపితే డ‌బుల్ హ్యాట్రిక్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ సినిమా కెరీర్ మామూలుగా లేదు. కొంత కాలంగా బాల‌య్య‌కి ఎదురే లేకుండా సాగిపోతుంది. ప‌ట్టిన ప్రాజెక్ట్ అల్లా బంగార‌మే అవుతుంది. 'అఖండ' నుంచి మొద‌లైన బాల‌య్య విధ్వంసం య‌ధావిధిగా కొన‌సాగుతుంది. 'అఖండ' త‌ర్వాత 'వీరసింహారెడ్డి', 'భ‌గ‌వంత్ కేస‌రి'తో వ‌రుస‌గా వంద కోట్ల వ‌సూళ్ల‌తో మూడు సెంచ‌రీ కొట్టిన చిత్రాలే. ప్ర‌స్తుతం 109వ సినిమా బాబితో చేస్తున్నారు.

ఇది ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. బాబి కి ఇంత‌వ‌ర‌కూ ఫెయిల్యూర్ లేదు. బాల‌య్య లాంటి మాస్ హీరో దొరికితే అత‌డి కంటెంట్ పీక్స్ కి వెళ్లిపోతుంది. 109 లో అదే రిపీట్ అవుతుంద‌ని అభిమానులంతా అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత 110వ చిత్రం బోయపాటితో ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసారు. ఆ కాంబో గురించి చెప్పేదే ముంది. ర‌చ్చ ర‌చ్చే జ‌రుగుతుంది. ఇది యధావిధిగా జ‌రిగితే బాల‌య్య‌కి వ‌రుస‌గా ఐదు విజ‌యాలు ప‌డిన‌ట్లే.

మ‌రో విజ‌యం కూడా ద‌క్కితే డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదైన‌ట్లే. అటు రాజ‌కీయాల్లోనే బాల‌య్య‌కి తిరుగు లేదు. మొన్న‌టి గెలుపుతో హిందుపురంలో హ్యాట్రిక్ విజ‌యం న‌మోదు చేసారు. సినిమాల్లో హ్యాట్రిక్...రాజ‌కీయం హ్యాట్రిక్ రెండు క‌లిపితే డ‌బుల్ హ్యాట్రిక్ అవుతుంది. అందుకే బాల‌య్య‌ని దిల్ రాజ్ అండ్ కో ఇలా స‌త్క‌రించింది. రెండు చోట్లా బాల‌య్య దూకుడు ఇలాగే కొన‌సాగాల‌ని దిల్ రాజు ఆకాంక్షించారు.

అందుకు బాల‌య్య ఎంతో సంతోష ప‌డ్డారు. దిల్ రాజు తో పాటు మ‌రో నిర్మాత దాము, ప్ర‌సన్న కుమార్ కూడా ఉన్నారు. ముగ్గురు బాల‌య్య‌కి బొక్కే అందించి సాలువా క‌ప్పి స‌న్మానించి విషెస్ తెలియ‌జేసారు. ఇప్ప‌టికే బాల‌య్య విజ‌యాల్ని చూసి నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్. జై బాయ‌ల్య నినాదాల‌తో సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావ‌డంతో రెట్టింపు ఉత్సాహంతోనూ క‌నిపిస్తున్నారు.