Begin typing your search above and press return to search.

దిల్ రూబా 'కన్నా నీ'.. సో ఎమోషనల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. రీసెంట్ గా 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు

By:  Tupaki Desk   |   28 Feb 2025 3:41 PM GMT
దిల్ రూబా కన్నా నీ.. సో ఎమోషనల్!
X

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. రీసెంట్ గా 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఓ రేంజ్ లో అలరించారు. ఇప్పుడు దిల్ రూబాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు విశ్వకరణ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సరిగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిల్స్ తో సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి రూపొందిస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న దిల్ రూబా మూవీని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు మార్చి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది.

మేకర్స్ ఇస్తున్న ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. అదే సమయంలో సాంగ్స్.. ఆడియన్స్ ను వేరే లెవెల్ లో ఆకట్టుకున్నాయి. రిపీట్ మోడ్ లో సాంగ్స్ ను వింటున్నారు మ్యూజిక్ లవర్స్. అలా అన్ని పాటలు అట్రాక్ట్ చేస్తున్నాయి.

అందులో బ్రేకప్ సాంగ్ కన్నా నే మరింతగా మెప్పిస్తోంది. కన్నా నే ప్రేమ సంద్రమే.. నేను నీ తీరమే అంటూ సాగుతున్న పాట.. అలరిస్తోంది. అద్భుతమైన లిరిక్స్.. ఎమోషనల్ ఫీలింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. సూతింగ్ మ్యూజిక్ తో ప్రత్యేకంగా ఉండి ఫిదా చేస్తోంది. సాంగ్ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి.. టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా కన్నా నే అంటూ థీమ్ మ్యూజిక్ అందించారు సంగీత దర్శకుడు సామ్ సీఎస్. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతోపాటు డిమాండ్లు వస్తుండడంతో థీమ్ మ్యూజిక్ ను సాంగ్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు కన్నా నే పాట కూడా టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది.