Begin typing your search above and press return to search.

'ఖిలాడీ' బ్యూటీ టాటూను చూశారా

థాయ్‌లాండ్‌లోని క్రాబీ ఎలిఫెంట్‌ అభయారణ్యంలో ఏనుగులతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను షేర్‌ చేశారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 9:30 PM GMT
ఖిలాడీ బ్యూటీ టాటూను చూశారా
X

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ డింపుల్‌ హయతి. మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న డింపుల్‌ హయతీ హీరోయిన్ గా రవితేజకు జోడీగా ఖిలాడీ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పరిచిన ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్‌ మీడియా ద్వారా, సినిమాల ద్వారా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది.

డింపుల్ హయతి తాజాగా తన టాటూను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. తనకు జంతువులు అంటే అమితమైన ఇష్టం. జంతువులతో నా ఆత్మ కమ్యూనికేట్‌ చేస్తుంది. నేను ఎప్పుడూ జంతువుల్లో నా స్నేహితులను వెతుక్కుంటూ ఉన్నాను. థాయ్‌లాండ్‌లోని క్రాబీ ఎలిఫెంట్‌ అభయారణ్యంలో ఏనుగులతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను షేర్‌ చేశారు. అంతే కాకుండా తన కాలిపై వేసుకున్న ఏనుగు ఆకారం టాటూను షేర్ చేసింది. చాలా స్టైలిష్‌ లుక్ లో డింపుల్‌ హయతీ కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ తో పాటు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

గత ఏడాది రామబాణం సినిమాలో నటించింది. గోపీచంద్‌ హీరోగా నటించిన రామబాణం సినిమాలో ఈ అమ్మడు నటించడం ద్వారా ప్రేక్షకులను అలరించింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా నిరాశపరచడంతో ఈ అమ్మడు మళ్లీ ఆఫర్‌ ను సొంతం చేసుకోలేక పోయింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తుంది. ఐటెం సాంగ్‌లకు ఓకే చెబుతున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలని ఆశ పడుతోంది.

సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఎక్కువ ఆఫర్లు సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ డింపుల్‌ హయతికి మాత్రం ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు, చిన్న సినిమాల్లో మాత్రం ఈమె నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ముందు ముందు ఈ అమ్మడు హీరోయిన్‌గా బిజీ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు. నెట్టింట మాత్రం ఈ అమ్మడి ఫాలోయింగ్‌ రోజు రోజుకు అందాల ఆరబోత కారణంగా పెరుగుతూనే ఉంది.