Begin typing your search above and press return to search.

17 రోజుల్లోనే ఆ హీరోయిన్ అన్ని కిలోలు తగ్గిందా?

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుందన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:00 AM GMT
17 రోజుల్లోనే ఆ హీరోయిన్ అన్ని కిలోలు తగ్గిందా?
X

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా.. ఆ మధ్యలో పార్కింగ్ విషయంలో ఓ పోలీస్ ఆఫీసర్ తో గొడవపడి వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత వేణుస్వామితో తన ఇంట్లో పూజలు చేయించుకుని వైరల్ అయింది. ఆ సమయంలో పూజ జరిగిన ప్లేస్ లో వైన్ బాటిల్స్ కనపడడం అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తెలుగమ్మాయి అయిన డింపుల్ హయతి.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోకపోయినా ఆమె అందానికి మాత్రం టాలీవుడ్ సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఆమె సినిమాల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు సందడి చేస్తుంటోంది డింపుల్. రకరకాల ఔట్ ఫిట్స్ లో పిక్స్ దిగి పోస్ట్ చేస్తుంటోంది. అయితే డింపుల్ హయతి లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

17 రోజుల పాటు జిమ్ లో తీవ్రంగా కసరత్తు చేసి 3 కిలోలు తగ్గినట్లు డింపుల్ పోస్ట్ చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోస్ ను గ్లింప్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటూ షేర్ చేసింది. అందులో తీవ్రంగా కసరత్తులు చేస్తూ కనిపించింది. తన కష్టమేంటో వీడియోస్ ద్వారా పంచుకుంది. తన ఫిట్నెస్ ట్రైనర్ అండ్ కోచ్ తరుణ్ శోల రాజన్ ను తన ఫాలోవర్స్, ఫ్యాన్స్ కు పరిచయం చేసింది డింపుల్.

డింపుల్ వీడియోస్ చూసిన వారు.. అమ్మడు బాగానే కష్టపడినట్లు తెలుస్తోందని అంటున్నారు. 17 రోజుల్లో 3 కిలోలు తగ్గడం అంటే మామూలు విషయం కాదని చెబుతున్నారు. వెయిట్ లాస్ అయ్యాక ఆనందం ఆమె ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే డింపుల్.. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని కొద్ది రోజులుగా చూస్తోంది. అందుకే వెయిట్ లాస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇక డింపుల్ సినిమాల విషయానికొస్తే.. 2017లో గల్ఫ్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ తర్వాత యురేకా మూవీలో యాక్ట్ చేసింది. అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ లో మెస్మరైజ్ చేసింది డింపుల్. అనంతరం సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం వంటి చిత్రాలు చేసింది. రీసెంట్ గా మాత్రం ఒక్క మూవీలో కూడా కనిపించలేదు. మరి మరింత నాజూగ్గా మారిన డింపుల్.. ఎలాంటి ఛాన్సులు అందుకుంటుందో వేచి చూడాలి.