ఆకుపచ్చ లెహంగాలో డింపుల్ దుమారం!
ఆ రెండు పరాజయాల తర్వాత ఇంతవరకూ మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు
By: Tupaki Desk | 18 Jan 2024 3:31 PM GMTడింపుల్ హయతి టాలీవుడ్ కి మెరుపులా దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులందుకుని అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించిన అమ్మ డికి ఈ క్రేజీ ఛాన్సులు ఎలా ఒడిసి పట్టుకుంటుంది? అన్న పెద్ద చర్చ సాగింది. `ఖిలాడీ`..`రామబాణం` లాంటి చిత్రాల తో మరింతగా దగ్గరైంది. కానీ ఆ వేగాన్ని అటుపై కనసాగించలేకపోయింది. ఛాన్సులైతే వచ్చాయి గానీ పరాజయాలు అమ్మడిని రేసులో వెనక్కి నెట్టాయి.
ఆ రెండు పరాజయాల తర్వాత ఇంతవరకూ మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు. అమ్మడిప్పుడు సీరియస్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. స్టార్ హీరోతో నటించిన బ్యూటీ ఒక్కసారిగా చిన్న సినిమాలకు సైన్ చేయాలంటే? చెప్పుకోలేని ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తుందో! పెద్ద ఛాన్సుల కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి అమ్మడు గెస్ చేస్తున్నట్లు ఆ రకమైన ఛాన్సులు అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
లుక్ పరంగానూ డింపుల్ లో మార్పులు కనిపిస్తున్నాయి. మునుపటి కన్నా చబ్బీ లుక్ లో కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో డింపుల్ యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో నెటి జనులకు టచ్ లో ఉంటుంది. ఎలివేషన్ పరంగా ఎక్కడా తగ్గేదేలే అంటూ ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసింది. తాజాగా అమ్మడు లెహంగా దుస్తుల్లో తళుకులీనింది. ఇదిగో ఇక్కడిలా ఆకు పచ్చ రంగు లెహంగాలో అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది.
అమ్మడు అందంగా అలంకరించుకున్న కొన్ని ఫోటోల్ని నెట్టింట వదిలిది. నుదిటిన పాపిడి బొట్టు.. డిజైనర్ లెహంగా..చేతికి మ్యాచింగ్ యాక్సరసీస్..మ్యాకప్..హెయిర్ స్టైల్ ప్రతీది డింపుల్ ని ఎంతో అందంగా హైలైట్ చేస్తున్నా యి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అమ్మడి అభిమానులు డింపుల్ అందాన్ని అంతే పొగిడేస్తున్నారు. హాట్ హాట్ దుస్తుల్లో కనిపించే బ్యూటీ ట్రెడీషనల్ లెహంగా లుక్ కొత్త అనుభూతినిస్తుంది.