Begin typing your search above and press return to search.

2000 కోట్ల వ‌సూల్.. నిర్మాత అభిరుచితో సాధించింది

ఇదే స‌మావేశంలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ.. మడాక్ ఫిలింస్ అధినేత దినేష్ విజ‌న్ తో త‌న స్నేహం ఎంతో గొప్ప‌ద‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   12 April 2025 12:30 AM
Dinesh Vijan movies list
X

ఈ సంవత్సరం లక్ష్మణ్ ఉటేకర్ ఛావా .. గత సంవత్సరం అమర్ కౌశిక్ స్త్రీ 2 చిత్రాలతో భారీ విజయాన్ని అందించిన దినేష్ విజన్, తన నిర్మాణ సంస్థ మ‌డాక్ ఫిలింస్ తో పాటు మొత్తం చిత్ర పరిశ్రమ కూడా బాగా రాణించాలని కోరుకున్నాడు. ''మనం చేస్తున్నది మన తప్పుల నుండి నేర్చుకోవడమే. ప్రస్తుతం మనం పాశ్చాత్య దేశాలనుంచి ఏదీ ఆశించడం లేదు. మనం ఎలా ఆలోచిస్తామో దాని ప‌రంగా కూడా మనం భారతీయులం. ఒక సామాన్యుడు భార‌తీయ‌త నిండిన కథలు కోరుకుంటున్నాడు. వారు శుక్రవారం థియేటర్లకు వస్తున్నారు. హై ప్రొఫైల్స్ 8-9 రోజుల తర్వాత థియేట‌ర్ల‌కు వస్తున్నారు. కాబట్టి బహుశా మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు సినిమాలు ఆడ‌టానికి చాలా ముఖ్యమైనవారు. ఎందుకంటే నిర్మాత‌ తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసేది వారే. వారి కోసం సినిమాలు చేస్తున్నా. నా రచయితలు, దర్శకులు నాతో స్థిరపడినందుకు నేను అదృష్టవంతుడిని. వారందరూ నిజమైన ప్ర‌తిభావంతులు. భారత దేశంతో అనుసంధానించబడి ఉన్నారు. చాలా గర్వంగా ఉంది'' అని దినేష్ అన్నారు.

ఇదే స‌మావేశంలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ.. మడాక్ ఫిలింస్ అధినేత దినేష్ విజ‌న్ తో త‌న స్నేహం ఎంతో గొప్ప‌ద‌ని అన్నారు. అత‌డి ప‌రిచ‌యం త‌న జీవితాన్ని మార్చేసింద‌ని కూడా ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత అంటే అత‌డే. అభిరుచితో ప్ర‌తిదీ ప్ర‌య‌త్నిస్తారు. చిన్నా పెద్ద అనే తేడా లేదు! అని ఆకాశానికెత్తేశారు.

మడాక్ నిర్మించిన భూల్ చ‌క్ మాఫ్ లో రాజ్ కుమార్ రావు న‌టించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా, రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ.. దినేష్ మాడ్డాక్ ఫిల్మ్స్ తో తన మొదటి సినిమా అవ‌కాశం గురించి గుర్తు చేసుకున్నాడు. ''కొన్ని మ్యాచ్‌లు స్వర్గంలో తయారవుతాయి. దినూ (విజన్) నేను కూడా అలాంటి వారిలో ఉన్నాం. దినూ దర్శకత్వం వహించిన రాబ్తా (2017)లో నేను చిన్న పాత్ర పోషించినప్పుడు మా బంధం మొద‌లైంది. ఆ పాత్రలో నన్ను గుర్తుపట్టలేనందున ఎవరైనా ఆ పాత్ర చేసి ఉండవచ్చని అందరూ అన్నారు. ఆ సమయంలో దానికి ఒక కారణం ఉండాలని నేను భావించాను. మేం క‌ల‌వ‌డానికి అది ఒక కార‌ణం'' అని రాజ్ కుమార్ అన్నారు.

అతడు రాబ్తాలో 324 ఏళ్ల నాటి పురాతన వ్యక్తిగా నటించాడు. అత‌డిని భారీ ప్రొస్థెటిక్ తో గుర్తించలేనంత‌గా మేక‌ప్ చేసారు. అయితే ఆ అతిధి పాత్ర అతడిని స్ట్రీ వంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీకి లీడ్ పాత్ర పోషించేలా చేసింది. నాకు తెలిసిన ఏకైక నిర్మాత దినేష్ విజ‌న్. తన సినిమాలన్నింటినీ అవి చిన్నవైనా, పెద్దవైనా, ఒకేలాంటి నిజాయితీ, అభిరుచితో ఇష్టపడతాడు. అదే అతడి గొప్ప గుణం. అతడు మంచి మంచి కథలను, ద‌ర్శ‌కుల‌ను వెతుకుతారు. ఒక నటుడికి అంత‌కంటే ఇంకా ఏమి కావాలి! అని అన్నారు. భూల్ చుక్ మాఫ్ అనేది మాడ్డాక్ నుండి మరొక చమత్కారమైన కామెడీ మూవీ. మ‌డాక్ ఫిలింస్ ఈ రెండేళ్ల‌లో భారీ విజ‌యాల‌ను అందించి ఏకంగా 2000 కోట్లు పైగా బాలీవుడ్ ఖాతాలో ఆర్జించిన ఘ‌న‌త‌ను సాధించింది. దినేష్ విజ‌న్ అభిరుచి, డెడికేష‌న్, సినిమాపై ఫ్యాష‌న్ కార‌ణంగానే ఇది సాధ్య‌మైంద‌ని రాజ్ కుమార్ రావు ప‌రోక్షంగా తెలివిగా ఈ వేదిక‌పై చెప్పారు. కేవ‌లం స్త్రీ 2, ఛావా చిత్రాలు రెండూ క‌లిపి జాయింట్ గా 1600 కోట్లు వ‌సూలు చేసాయి.