Begin typing your search above and press return to search.

సీక్వెల్స్ ట్రెండ్.. మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు రెడీ!

దీంతో అనేక మంది మేకర్స్.. సీక్వెల్స్ ను తెరకెక్కించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 7:46 AM GMT
సీక్వెల్స్ ట్రెండ్.. మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు రెడీ!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు రెండో పార్టును సీక్వెల్, ప్రీక్వెల్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ ట్రెండ్.. చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. దీంతో అనేక మంది మేకర్స్.. సీక్వెల్స్ ను తెరకెక్కించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని సెట్స్ పై ఉండగా.. మరిన్ని సెట్స్ పై వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు డైరెక్టర్లు.. ఇప్పటికే తాము చేసిన హిట్ సినిమాలకు సెకెండ్ పార్టులను తీసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు గాను బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్న వాళ్ళు.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

వారెవురు అంటే.. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రశాంత్ వర్మతోపాటు క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి. హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. గతంలో జాంబీ రెడ్డి మూవీ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు జాంబీ రెడ్డి సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు అంత‌గా ప‌రిచ‌యం లేని ఓ కొత్త నేప‌థ్యాన్ని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సీక్వెల్ కోసం ఎలాంటి స్టోరీ రాసుకుంటారనేది ఆసక్తికరం. క్యాస్టింగ్ ను మార్చుతారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, యంగ్ హీరోయిన్ పాయల్ రాజపుత్ లీడ్ రోల్ లో నటించిన మంగళవారం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హారర్ జోనర్ లో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఆ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి మంచి హిట్ ను అందుకున్నారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు సొంతం చేసుకున్నారు.

అయితే ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. సీక్వెల్ లో పాయల్ రాజపుత్ కాకుండా మరో స్టార్ హీరోయిన్ లీడ్ పోషించనుందని వినికిడి. మరి అటు జాంబీ రెడ్డి సీక్వెల్.. ఇటు మంగళవారం సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో.. ఎలా ఉంటాయో వేచి చూడాలి.