Begin typing your search above and press return to search.

కల్కి ఎలా ఉంటుందంటే..: నాగ్ అశ్విన్

రీసెంట్ గా రిలీజైన కల్కి ట్రైలర్.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మూవీపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది

By:  Tupaki Desk   |   12 Jun 2024 7:54 AM GMT
కల్కి ఎలా ఉంటుందంటే..: నాగ్ అశ్విన్
X

కల్కి 2898 ఏడీ.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై కల్కి ప్రపంచాన్ని చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా రిలీజైన కల్కి ట్రైలర్.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మూవీపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న నాగ్ అశ్విన్ మేకింగ్ ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్యారెక్టరైజేషన్ కు ఫిదా అయిపోయారు. నాగి టాలెంట్ వేరే లెవెల్ అంటూ కొనియాడారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని, ట్రైలర్ ద్వారా నాగ్ అశ్విన్ ఎంత కష్టపడ్డారో తెలిసిందని అనేక మంది పోస్టులు పెట్టారు.

ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ స్పందించారు. ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో ఎమోషనల్ గా ఉందని తెలిపారు. సైన్స్, మైథాలిజీని కలిపి సినిమా తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు చెప్పారు. అ రెండింటిపై తనకు మంచి ఇంట్రెస్ట్ ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు అనేక మంది ఆర్టిస్టుల సహాయంతో తాను అనుకున్నట్లు మెథాలిజీకి సమపాళ్లలో సైన్స్ యాడ్ చేసి కల్కి మూవీ తీశానని వెల్లడించారు నాగ్ అశ్విన్.

ముఖ్యంగా క్యాస్టింగ్ అండ్ టీమ్ టాలెంట్ తోపాటు డెడికేషన్ తో సినిమా తెరకక్కించడం సాధ్యమైందని నాగి తెలిపారు. తన డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి చాలా టైమ్ పట్టిందని కూడా చెప్పారు. కల్కి కోసం మూవీ టీమ్ అంతా ఎంతో కష్టపడిందని వెల్లడించారు. సినిమా చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కాలర్ ఎగరేసుకునేలా గర్వపడతారని చెప్పి.. మూవీపై ఉన్న అంచనాలను మరిన్ని పెంచారు డైరెక్టర్.

మరోవైపు, కల్కి ట్రైలర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. హిందీ వెర్షన్ ఒక్కరోజులో 14 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. తెలుగులో కూడా సత్తా చాటుతోంది. వచ్చే వారం మరో ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో మరింత సాలిడ్ కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారని వినికిడి. చివరగా జూన్ 27వ తేదీన సినిమా రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే.