Begin typing your search above and press return to search.

అప్పు తీర్చేందుకే యాక్టర్ అవతారం..!

ఐతే దర్శకుడిగా సినిమా మాధ్యమం ద్వారా డిఫరెంట్ స్టోరీస్ ను అందించాలనే ఉద్దేశంతో తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టానని అన్నారు

By:  Tupaki Desk   |   26 Sep 2024 3:15 AM GMT
అప్పు తీర్చేందుకే యాక్టర్ అవతారం..!
X

బాలీవుడ్ డైరెక్టర్స్ లో అనురాగ్ కశ్యప్ గురించి అందరికీ తెలిసిందే. ఐతే దర్శకుడిగా సినిమా మాధ్యమం ద్వారా డిఫరెంట్ స్టోరీస్ ను అందించాలనే ఉద్దేశంతో తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టానని అన్నారు. కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన ఆయన తను డైరెక్ట్ చేసిన బ్లాక్ ఫ్రైడే భారత్ లో నిషేధించారు. ఒరిజినల్ ప్రింట్ కూడా కాల్చేస్తారేమో అని దాన్ని తీసుకుని ఫారిన్ వెళ్లానని అన్నారు అనురాగ్ కశ్యప్.

తన సినీ కెరీర్ గురించి రీసెంట్ గా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో మట్లాడిన ఆయన కెరీర్ లో ఆయన అనుభవాలు పంచుకున్నారు. ఇక దేవ్ డి సినిమా గురించి మాట్లాడుతూ దేవదాస్ భారతీయులకు ఎంతో ఇష్టమైన ప్రేమకథ. ఐతే తన దృష్టిలో అదేమంత మంచి కథ కాదని అన్నారు అనురాగ్ కశ్యప్. దేవదాస్ బుక్ ని ఆధారం చేసుకుని 20 సినిమాల దాకా తెరకెక్కించారని అన్నారు. ఐతే ఆ కథకు కాస్త సమకాలీన విషయాలను జోడించి తాను దేవ్ డి కథ రాసుకున్నానని అన్నారు అనురాగ్.

ఈ సినిమా కథ ఒక నటి బాయ్ ఫ్రెండ్ విని నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ స్క్రిప్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కి పంపిస్తావని అన్నాడు. నిర్మాత కూడా స్క్రిప్ట్ చదివి చెత్తగా ఉందని అన్నాడు. నిర్మాత భార్యకు కథ నచ్చడం వల్ల సినిమా తీశానని అన్నారు. అంతేకాదు తాను నటుడిగా మారిన సందర్భాన్ని కూడా చెప్పారు అనురాగ్. తాను తెరకెక్కించిన బాబే వెల్వెట్ పరాజయం అయ్యింది కాబట్టి ఆ నిర్మాణ సంస్థకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా అందుకోసం వాళ్లు నిర్మించిన అకీరాలో నటించానని అన్నారు అనురాగ్ కశ్యప్.

అప్పటి నుంచి తనకు నటుడిగా ఆఫర్లు వస్తున్నాయని అన్నారు అనురాగ్. రీసెంట్ గా విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో అనురాగ్ కశ్యప్ నటించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. సౌత్ లో కూడా అనురాగ్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ సరదాగా నటుడిగా మారినా ఇప్పుడు ఆయనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఆయన నటుడిగా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. రానున్న రోజుల్లో అటు డైరెక్షన్ ఇటు యాక్టర్ గా ఆరగొట్టలని చూస్తున్నారు.