'పుష్ప 2' కి అట్లీ సాలిడ్ రివ్యూ!
పుష్ప 2 సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు అట్లీ సైతం స్పందించారు.
By: Tupaki Desk | 5 Dec 2024 11:38 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. గత మూడు సంవత్సరాలుగా పుష్ప 2 సినిమా గురించి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మూడు ఏళ్ల క్రితం ప్రారంభం అయిన పుష్ప 2 సినిమాను ఎట్టకేలకు దర్శకుడు సుకుమార్ ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. పుష్ప తో పోల్చితే పుష్ప 2 కోసం అల్లు అర్జున్ రెండు మూడు రెట్లు ఎక్కువ కష్టపడ్డారు అనడంలో సందేహం లేదు. సినిమా చూస్తే అదే విషయం అర్థం అవుతుందని నెటిజన్స్, ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు.
సినిమా విడుదల అయినప్పటి నుంచి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పలువురు ప్రముఖ స్టార్స్ సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రెటీలు పుష్ప 2 సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ బన్నీ ఈ సినిమాను ఒక తపస్సు చేసినట్లు చేశాడు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు అట్లీ సైతం స్పందించారు.
కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... అల్లు అర్జున్ సర్ మీ నటన ఔట్ స్టాండింగ్, నిజంగా నా హార్ట్కి టచ్ అయ్యింది. పుష్ప 2తో మరో సారి బ్లాక్ బస్టర్ కొట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసిన సుకుమార్ గారికి కంగ్రాట్స్. మొత్తం యూనిట్ సభ్యుల కష్టం కనిపిస్తోంది. రష్మిక మందన్న నటనతో బీస్ట్ల కనిపించారు. ఫహద్ ఫాజిల్ నటన బాగుంది అంటూ సినిమాకు చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అట్లీ రివ్యూతో కోలీవుడ్ ప్రేక్షకులు పుష్ప 2 కి మరింతగా ఆకర్షితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గతంలో అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వారి కాంబో మూవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా గురించి అట్లీ ప్రత్యేకంగా స్పందించాడు కనుక భవిష్యత్తులో కచ్చితంగా వీరి కాంబో మూవీ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం అట్లీ చేసిన పోస్ట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పుష్ప 2 కి కోలీవుడ్ నుంచి వచ్చిన అతి పెద్ద రెస్పాన్స్ ఇదే కావడంతో అక్కడి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. తమిళనాడులో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.110 కోట్లుగా తెలుస్తోంది. మరి ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందా అనేది చూడాలి.