Begin typing your search above and press return to search.

కమల్, రజనీ ఛాన్స్ ఇచ్చినా ఆ డైరెక్టర్ నాట్ ఓకే!

కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తో సినిమా చేయాలని ఎందరో డైరెక్టర్స్ ఎదురు చూస్తుంటారు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 3:15 AM GMT
కమల్, రజనీ ఛాన్స్ ఇచ్చినా ఆ డైరెక్టర్ నాట్ ఓకే!
X

కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తో సినిమా చేయాలని ఎందరో డైరెక్టర్స్ ఎదురు చూస్తుంటారు. ఛాన్స్ ఇవ్వడమే లేటు.. స్టోరీ వినిపించి.. వారిని ఒప్పించేందుకు ట్రై చేస్తుంటారు. అలా వారిద్దరితో మూవీ తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ ఓ తమిళ డైరెక్టర్.. తనకు కమల్, రజినీ ఛాన్స్ ఇచ్చిన సినిమా చేయనంటున్నారు.

ఆయనెవరో కాదు.. కోలీవుడ్ డైరెక్టర్ బాలా. శివ పుత్రుడు, నేనే దేవుడ్ని, వాడు వీడు సినిమాలతో తెలుగులో కూడా ఆయన మంచి గుర్తింపు అందుకున్నారు. శివపుత్రుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అలాంటి నటుడు గత కొంత కాలంగా సరైన సక్సెస్ లు అందుకోవడం లేదు. మొదట తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ బాలా చేతుల్లోకి వచ్చింది. కానీ కొంత షూటింగ్ అనంతరం అవుట్ ఫుట్ బాలేదని మేకర్స్ క్యాన్సిల్ చేశారు.

ఇక బాల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ వనంగాన్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కమల్ హాసన్ లేదా రజనీకాంత్ వంటి పెద్ద హీరోలతో చిత్రాలు చేస్తారా అన్న ప్రశ్న బాలాకు ఎదురైంది. దీంతో ఆయన నో చెప్పారు. రజనీకాంత్ లేదా కమల్ హాసన్ వంటి పెద్ద హీరోల సెలెక్షన్స్.. తనకు భిన్నంగా ఉంటాయని బాలా తెలిపారు. వారితో తాను ఎప్పటికీ సినిమాను డైరెక్ట్ చేయనని వెల్లడించారు.

రజనీకాంత్ తన తరహా చిత్రాల్లో నటించడానికి ఎప్పటికీ అంగీకరించరని, అలాంటి కాంబో సెట్ అవ్వడం కష్టమని బాలా అన్నారు. ప్రస్తుతం బాలా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే బాలా దర్శకత్వం వహించిన వనంగాన్ మూవీ.. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది. రిలీజ్ కు మరికొద్ది రోజులే ఉండడంతో... మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

అయితే వనంగాన్ సినిమాలో మొదటి హీరోగా సూర్యను సెలెక్ట్ చేశారు. ఇప్పటికే సూర్య, బాలా కాంబోలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నంద, పితామగన్ చిత్రాలు మంచి హిట్స్ గా నిలిచాయి. దీంతో వనంగాన్ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ సూర్య అనూహ్యంగా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత అరుణ్ విజయ్ ను తీసుకున్నారు మేకర్స్. హీరోయిన్ గా రోషిణీ ప్రకాష్ ను రంగంలోకి దించారు. అంతకుముందు మమితా బైజును ఎంపిక చేయగా.. ఆమె బయటకు వచ్చేశారు. దర్శకుడు బాలా తనపై చేయి చేసుకున్నారని అందుకే సినిమా నుంచి తప్పుకున్నానని రీసెంట్ గా తెలిపారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకుల్లో వనంగాన్ భారీ అంచనాలను సృష్టించింది. మరి ఆ సినిమా జనవరి 10న ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.