అవన్నీ చెత్త సినిమాలు.. మెగా డైరెక్టర్ కామెంట్!
బాల్కీ ఇటీవలి బాలీవుడ్ బ్లాక్ బస్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత 4-5 ఏళ్లలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌లు చెత్త కంటెంట్ ఉన్న చిత్రాలు అని అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 21 Nov 2024 5:46 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పా, చీనీ కమ్.. అక్షయ్ కుమార్‌తో 'ప్యాడ్ మ్యాన్' లాంటి ప్రయోగాత్మక చిత్రాల్ని తెరకెక్కించి విమర్శకుల మెప్పు పొందిన ఆర్.బాల్కీ ఇటీవలి బాలీవుడ్ బ్లాక్ బస్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత 4-5 ఏళ్లలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌లు చెత్త కంటెంట్ ఉన్న చిత్రాలు అని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ చెత్త సినిమాలు అని, బాగా బోరింగ్ గా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పూణెలోని MIT వరల్డ్ పీస్ యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో R. బాల్కీ మాట్లాడారు. ''నేను కేవలం మేధావి లేదా కళాత్మక దృక్కోణం నుండి మాత్రమే చెబుతున్నాను. కానీ పాత కాలపు వినోదాత్మక చిత్రాలు.. 'మసాలా, పైసా వసూల్' కథలతో రూపొందాయని భావిస్తున్నానని, అవి బోరింగ్ సినిమాలు..అని కూడా బాల్కీ వ్యాఖ్యానించారు.
దిగ్గజ మన్మోహన్ దేశాయ్ రూపొందించిన 'అమర్ అక్బర్ ఆంథోనీ', 'నసీబ్' వంటి అమితాబ్ నటించిన చిత్రాలతో నేటి సినిమాను పోల్చి చూసారు బాల్కీ... ప్రస్తుత బ్లాక్ బస్టర్‌లను చూస్తే.. వాటి కంటే పూర్తిగా క్లాసిక్ డే సినిమాలు చూడటానికి సరదాగా ఉంటాయని అన్నాడు. సినిమాలు ఇటీవల ఒక ప్రాజెక్ట్ లాగా మారాయని, దానిలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి పొందే లక్ష్యంతో ఆర్థశాస్త్రం ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్ చేయడం వల్ల ఆ సినిమాలు మంచివని ప్రజలు నమ్మి థియేటర్‌లకు వెళుతున్నారని విశ్లేషించారు. 'ఇది చెత్త సినిమా' అని ప్రజలు తెలుసుకునే సమయానికి డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.
ప్రేక్షకుల మనస్తత్వం గురించి బాల్కీ కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్నిసార్లు ప్రజలు సినిమా చూసిన తర్వాత అది చెత్త సినిమానా కాదా? అన్నది చూడాలని.. సినిమా గురించి ఒకటి లేదా రెండు మంచి విషయాలను కనుగొనాలని ఆయన అన్నారు. స్టార్ లలో ఏదైనా నచ్చితే 500 రూపాయలు చెల్లించి తమను తాము తిట్టుకోరు కాబట్టి 'టైమ్ పాస్ మూవీ' అని చెబుతారు. నేను అంత తెలివితక్కువవాడిని కాదు.. అని అన్నారు.
ఆర్.బాల్కీ చివరిగా దర్శకత్వం వహించిన 'ఘూమర్' 2023లో విడుదలైంది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇటీవలి కమర్షియల్ హిట్ చిత్రాలను విమర్శించిన బాల్కీ తన కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ సినిమాని కూడా అందించలేకపోయారన్నది గమనించాలి. అతడు అవార్డులు అందుకున్న చిత్రాలను మాత్రమే రూపొందించగలిగారు. దీనర్థం ఆయన ఒక సెక్షన్ ఆడియెన్ ని మాత్రమే మెప్పించగలిగారు కానీ మాస్ ని థియేటర్లలోకి రప్పించలేకపోయారని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పని చేసినంత మాత్రాన కెరీర్ లో కమర్షియల్ హిట్ ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.