Begin typing your search above and press return to search.

సీనియ‌ర్లంతా ప‌ని రాక్ష‌సులు!

డైరెక్ట‌ర్ గా బాబి మంచి స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ప‌వ‌ర్` తో డైరెక్ట‌ర్ గా ప‌రిచయ‌మైన బాబి ఇప్ప‌టి వ‌ర‌కూ తీసిన సినిమాల‌న్ని మంచి ఫ‌లితాలు ఇచ్చాయి.

By:  Tupaki Desk   |   12 Jan 2025 12:30 PM GMT
సీనియ‌ర్లంతా ప‌ని రాక్ష‌సులు!
X

డైరెక్ట‌ర్ గా బాబి మంచి స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ప‌వ‌ర్` తో డైరెక్ట‌ర్ గా ప‌రిచయ‌మైన బాబి ఇప్ప‌టి వ‌ర‌కూ తీసిన సినిమాల‌న్ని మంచి ఫ‌లితాలు ఇచ్చాయి. `స‌ర్దాగ్ గ‌బ్బ‌ర్ సింగ్` మిన‌హా చిత్రాల‌న్నీ క‌మ‌ర్శియ‌ల్ గా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. అలాగే కెరీర్ ఆరంభంలోనే సీనియ‌ర్ హీరోల‌ను డైరెక్ట్ చేసిన ఘ‌న‌త బాబి సొంతం. తొలి సినిమా మాస్ రాజా ర‌వితేజ‌తో, త‌దుప‌రి సినిమా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో, అటుపై `వెంకీ మామ‌` తో విక్ట‌రీ వెంక‌టేష్‌ని, `వాల్తేరు వీర‌య్య‌`తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసారు.

అలాగే త‌ర్వ‌త త‌రం హీరో అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో `జై ల‌వ‌కుశ` తెర‌కెక్కించారు. తాజాగా `డాకు మ‌హారాజ్` తో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌ని డైరెక్ట్ చేసారు. మ‌రి ఈ సీనియ‌ర్లంద‌రి నుంచి బాబి నేర్చుకుంది ఏంటి? అంటే ఇలా స్పందించారు. అగ్ర హీరోల‌తో ప‌నిచేయడం అన్న‌ది ద‌ర్శ‌కుల‌కు చాలా ఉప‌యోగ ప‌డుతుంది. చెప్పిన స్క్రిప్ట్ తెర‌పైకి వెళ్లే స‌రికి ఎలా మారుతుంది? అన్న దానిపై వాళ్ల‌కు మంచి అవ‌గాహ‌న ఉంటుంది.

వాళ్లంతా ప‌ని రాక్ష‌సులు. సెట్ కి వ‌చ్చారంటే ప‌ని త‌ప్ప మ‌రో ద్యాస ఉండ‌దు. అంత‌గా బాండ్ అయి ప‌ని చేస్తారు. `డాకు మ‌హారాజ్` లో బాల‌కృష్ణ గారు రియ‌లిస్టిక్ స‌న్నివేశాలు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. వాళ్ల‌తో ప‌ని అనుభ‌వం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది. ఎన్నో కొత్త విష‌యాలు తెలుసుకున్నాను. సీనియ‌ర్ల‌తో ప‌నిచేసే అవ‌కాశం నాకు ఆరంభంలోనే ద‌క్క‌డ అన్న‌ది అదృష్టంగా భావిస్తున్నాను` అని అన్నారు.

న‌లుగురు సీనియ‌ర్ హీరోలు 60 ఏళ్లు దాటిన వారే. ఆ వ‌య‌సులో సైతం రిస్క్ షాట్స్ విష‌యంలో ఏమాత్రం వెనుకాడ‌రు. ప్రేక్ష‌కులకు వాస్త‌వ అనుభూతి పంచడం కోసం ఎంతో రిస్క్ తీసుకుని వాటిలో న‌టిస్తుంటారు. సెట్ కి వ‌చ్చారంటే 30 ఏళ్ల వ‌య‌సుగ‌ల హీరోలైపోతారు. సైరా న‌ర‌సింహారెడ్డిలో మెగాస్టార్ ప్ర‌త్యేక క‌త్తి యుద్దం, గుర్ర‌పు స్వారీపై ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్న సంగ‌తి తెలిసిందే.