డైరెక్టర్ బాబి వాటర్ బాటిల్ లవ్ స్టోరీ!
డైరెక్టర్ బాబి గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకూ వైఫల్యం లేని డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.
By: Tupaki Desk | 2 Feb 2025 2:30 PM GMTడైరెక్టర్ బాబి గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకూ వైఫల్యం లేని డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. `పవర్`, `సర్దార్ గబ్బర్ సింగ్`, ` జై లవకుశ`, `వెంకీమామ`, 'వాల్తేరు వీరయ్య' తో పాటు ఇటీవల రిలీజ్ అయిన `డాకు మహారాజ్` తోనూ భారీ విజయం అందుకున్నాడు. నెటి జనరేషన్ డైరెక్టర్లలో మాస్ హిట్లు ఇవ్వడం బాబికే చేల్లిందని ప్రతీసారి ప్రూవ్ చేస్తున్నాడు. ఇక వ్యక్తిగత జీవితంలో బాబి అంతే సంతోషంగా ఉన్నాడు.
చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను బాబి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ కుమార్తె గలదు. తాజాగా ఆ లవ్ స్టోరీ గురించి బాబి తొలిసారి ఓపెన్ అయ్యాడు. 'స్కూల్లో అనూషను లవ్ చేసాను. ఇద్దరి ప్రేమ కథ వాటర్ బాటిల్ లో నీళ్లు షేర్ చేసుకోవడంతో ప్రారంభమైంది. అలా మొదలై పెళ్లి వరకూ వెళ్లింది. అనూష స్కూల్ టాపర్. ఇంజనీరింగ్ లోనూ గోల్డ్ మెడలిస్ట్. వేలూరు ఎంటెక్ లోనూ గోల్డ్ మెడలిస్ట్.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే? ఏమీ లేని బాబిని తను పెళ్లి చేసుకోవడం. ఆమె కుటుంబం చాలా పెద్దది. అయినా నన్ను ఇష్టపడింది. కుతురిపై ప్రేమతో పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పటికి నేను ఘోస్ట్ రైటర్ని. కనీసం నా పేరు కూడా పడదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా? నన్ను నమ్మారు వాళ్లంతా. హైదరాబాద్ లో సంపాదన లేకుండా జీవిండచం కష్టం. పెళ్లాయ్యాక చాలా కష్టాలు పడ్డాం.
తల్లిదండ్రులు సహకరించాలని చూసినా? మా ఇబ్బందులు మా ఇంటి లోపలికే పరిమితం. సినిమా ఛాన్సుల కోసం తిరుగుతూనే అద్దెలు..ఈఎంఐలు చెల్లించేవాళ్లం. అలా మొదలైన ప్రయాణం ఇప్పుడు సంతోషంగా సాగు తుంది. ఎన్ని ఉన్నా? అనూష మాత్రం మారలేదు. ఇప్పటికీ సింపుల్ గానే ఉంటుంది. స్టార్ డైరెక్టర్ భార్య అని బయట ఎక్కడా చెప్పదు. ఇంట్లో కారు ఉన్నా? ఇప్పటికీ స్కూటీలో పాపను స్కూల్లో దించుతుంది. నా జీవితానికి ఆమె ఆదర్శం` అని అన్నారు.