`పుష్ప 2` ఈవెంట్లో జైలర్ దర్శకుడు ప్రత్యక్షం
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ``పుష్ప 2 విడుదల గురించి నేను రవి సర్, నవీన్ సర్లను ప్రతిసారీ అడిగేవాడిని.
By: Tupaki Desk | 25 Nov 2024 4:20 AM GMTతమిళంలో అగ్ర దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న నెల్సన్ దిలీప్ కుమార్.. ఇంతకుముందే రజనీకాంత్ కి జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `జైలర్ 2` కోసం కథ రాస్తున్నానని అతడు ఇంతకుముందు వెల్లడించారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 వేదికపై సందడి చేయడమే గాక బన్నీని అమాంతం పొగిడేశాడు. దీంతో అతడు అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ``పుష్ప 2 విడుదల గురించి నేను రవి సర్, నవీన్ సర్లను ప్రతిసారీ అడిగేవాడిని. పుష్ప -1 చూసినప్పుడు నాకు ఇన్స్టంట్ కనెక్షన్ అనిపించింది. తర్వాత అల్లు అర్జున్ని కలిసినప్పుడు ఆయన చరిష్మా గురించి చెప్పాను. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ , సుకుమార్ మూడు సంవత్సరాలు గడిపారు. ఇద్దరు ఎంత మక్కువతో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. అది తెలిసి ఆశ్చర్యపోలేదు. పుష్ప 2 చాలా పెద్దదిగా మరింత మెరుగ్గా ఉంటుంది`` అని అన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
భవిష్యత్తులో అల్లు అర్జున్తో కలిసి పని చేయబోతున్నారా? అని ప్రశ్నించగా, ``అది అల్లు అర్జున్ నుండి రావాలి, అతడు ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన డైరెక్ట్ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాను. నేను పాట్నా ఈవెంట్లో ప్రేక్షకులను చూశాను. కాబట్టి బన్నీ సార్, దయచేసి అన్ని భాషల్లో ఒక సినిమా చేయండి`` అని నెల్సన్ అన్నారు.