ప్రశాంత్ వర్మ మిస్టరీ ఐలాండ్.. కథ క్లిక్కయ్యిందా లేదా?
టాలీవుడ్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఇప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది.
By: Tupaki Desk | 22 Sep 2024 12:44 PM GMTటాలీవుడ్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఇప్పుడు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ ప్రూవ్ చేసుకున్నారు. దీంతో అతను కథ అందిస్తే కచ్చితంగా ఆ సినిమా లేదంటే వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ గతంలో ‘అద్భుతం’ అనే సినిమాకి స్టోరీ అందించారు. అయితే ఆ మూవీ పెద్దగా మెప్పించలేదు.
గల్లా అశోక్ హీరోగా తెరకెక్కిన ‘దేవకీ నందన వాసుదేవ’ అనే మూవీకి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఆయన స్టోరీ అందించిన ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ వెబ్ సిరీస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన అనీష్ కురువిళ్ళ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ వెబ్ సిరీస్ వచ్చింది.
అగాథా క్రిస్టి నవల, హాలీవుడ్ మూవీ స్క్వాడ్ గేమ్ ల నుంచి స్ఫూర్తి పొంది ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ వెబ్ సిరీస్ కథని ప్రశాంత్ వర్మ, సంజయ్ రాయ్ సంయుక్తంగా రాశారు. ఈ సిరీస్ లో అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, భానుచందర్, నందు, తేజస్వి మాదివాడ, ఆదర్శ్ బాలకృష్ణ లాంటి గుర్తింపు ఉన్న యాక్టర్స్ కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సిరీస్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ ఉన్న కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే మాట వినిపిస్తోంది
విజువల్ ప్రెజెంటేషన్ బాగున్న కూడా కథనం అంత ఎంగేజింగ్ గా లేదని టాక్ నడుస్తోంది. అలాగే క్యారెక్టర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేవని అంటున్నారు. ట్విస్ట్ లు కూడా ఊహించగలిగే విధంగానే ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం కాస్తా ఎంగేజింగ్ గా ఉందంట. సిరీస్ లో క్యారెక్టరైజేషన్స్ అంత బలంగా లేవని క్రిటిక్స్ అంటున్నారు. రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉందని, ఆడియన్స్ కి ఇంటెరెస్ట్ క్రియేట్ చేసే బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా సిరీస్ లో లేవనే మాట వినిపిస్తోంది.
సిరీస్ లో నెగిటి రోల్ లో నటించిన అక్షర గౌడ పెర్ఫార్మెన్స్, అలాగే అశుతోష్ రానా, నందుల నటన కొంత పర్వాలేదనే విధంగా ఉందంట. మిగిలిన క్యారెక్టర్స్ ఏవీ కూడా గొప్పగా లేవని సినీ విమర్శకులు అంటున్నారు. అలాగే సిరీస్ డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బ్యాడ్ గా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా స్టోరీ పరంగా ప్రశాంత్ వర్మ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ తో మెప్పించలేకపోయాడు. దర్శకుడిగా అనీష్ కురువిళ్ళ చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టారు. అయిన కూడా మేకింగ్ పరంగా కొత్తగా ఏమి ఎట్రాక్ట్ చేయలేదనే కామెంట్స్ వస్తున్నాయి.