Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్ట‌ర్లంతా వాళ్ల‌కే అంకిత‌మా?

అందుకే ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా బాగా ర్యాపో ఉన్న నిర్మాత‌ల‌తోనే సినిమాలు చేస్తారు. అలాంటి ర్యాపోతో సినిమా చేస్తే డైరెక్ట‌ర్ కి అసౌక‌ర్యం క‌ల‌గ‌దు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 12:30 PM GMT
ఆ స్టార్ డైరెక్ట‌ర్లంతా వాళ్ల‌కే అంకిత‌మా?
X

ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల మ‌ధ్య మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంటేనే గొప్ప ప్రొడ‌క్ట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు అడిగింద‌ల్లా స‌కాలంలో నిర్మాత ఏర్పాటు చేస్తేనే డైరెక్ట‌ర్ అనుకున్న‌ది తీయ‌గ‌ల‌డు. ఇందులో ఎక్క‌డ క్రియేటివ్ లేదా మ‌రో ర‌క‌మైన డిస్ట‌బెన్సెస్ క్రియేట్ అయితే సినిమా కిల్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అందుకే ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా బాగా ర్యాపో ఉన్న నిర్మాత‌ల‌తోనే సినిమాలు చేస్తారు. అలాంటి ర్యాపోతో సినిమా చేస్తే డైరెక్ట‌ర్ కి అసౌక‌ర్యం క‌ల‌గ‌దు.

తాను అనుకున్న‌ది వంద‌శాతం ప‌క్కాగా తీయ‌గ‌ల‌డు అన్న‌ది అంతే వాస్త‌వం. అయితే అదే అదునుగా కొంత మంది డైరెక్ట‌ర్లు ఒకే బ్యార్ల‌కు ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీంతో ఇండ‌స్ట్రీలో చాలా మంది నిర్మాత‌లు ఆ స్టార్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు నిర్మించాల‌ని ఉన్నా? ఓపెన్ కాలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. టాలీవుడ్ లో అలాంటి కాంబినేష‌న్లు కొన్ని ఉన్నాయి. గురూజీ త్రివిక్ర‌మ్ సినిమా అనౌన్స్ చేసాడంటే? అది హాసినీ-హారికా క్రియేష‌న్స్ లోనే ఉంటుంది.

అప్ప‌టి 'జులాయి' సినిమా నుంచి తాజాగా అల్లు అర్జున్ తో చేస్తోన్న ప్రాజెక్ట్ వ‌ర‌కూ. ఇదే బ్యాన‌ర్లో కంటున్యూగా సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాడు. అలాగే అనీల్ రావిపూడి అయితే నిర్మాత దిల్ రాజు బ్యానర్ కి అంకిత మైపోయాడు. అనీల్ రావిపూడి 8 సినమాలు డైరెక్ట్ చేస్తే అందులో ఆరు సినిమాలు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ లోనే డైరెక్ట్ చేసాడు. ఇదే త‌రహాలో సుకుమార్ కూడా క‌నిపిస్తున్నారు. 'రంగ‌స్థ‌లం'లో సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్ లో తెర‌కెక్కించారు.

ఆ త‌ర్వాత అదే సంస్థ‌లో 'పుష్ప‌-2' రెండు భాగాల‌ను కూడా తెర‌కెక్కించారు. రామ్ చ‌ర‌ణ్ తో చేస్తోన్న 17వ చిత్రం కూడా అదే బ్యాన‌ర్ నిర్మిస్తుంది. క‌ల్ట్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ కూడా అలాగే టీసీరిస్ లో బాండ్ అయి ప‌ని చేస్తున్నాడు. బాలీవుడ్ లో తెర‌కెక్కించిన 'క‌బీర్ సింగ్', 'యానిమ‌ల్' చిత్రాలు అదే బ్యాన‌ర్లో తెర‌కెక్కించాడు. ప్ర‌భాస్ తో తెర‌కెక్కించే 'స్పిరిట్' చిత్రం కూడా ఇదే బ్యాన‌ర్ నిర్మిస్తుంది. అలాగే బ‌న్నీ-సందీప్ ప్రాజెక్ట్ కి కూడా ఇదే సంస్థ అగ్రిమెంట్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.

వీళ్ల దారిలోనే శేఖ‌ర్ క‌మ్ములా, చందు మొండేటి కూడా క‌నిపి స్తున్నారు. 'ల‌వ్ స్టోరీ' చిత్రాన్ని క‌మ్ములా శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ ఎల్ పీ లో తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ధ‌నుష్‌, నాగార్జున‌తో తెర‌కెక్కిస్తోన్న 'కుబేర' కూడా బ్యాన‌ర్లో చేస్తున్నారు. చందు మొండేటి 'తండేల్' చిత్రాన్ని గీత ఆర్స్ట్ లో చేస్తున్నాడు. త‌న త‌దుప‌రి చిత్రం కూడా ఇదే బ్యాన‌ర్లో ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇలా స్టార్ డైరెక్ట‌ర్లు అంతా ఒకే బ్యాన‌ర్ కి ప‌రిమితం అవుతున్నారు.