మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ పై అత్యాచారం కేసు!
అయితే తాజాగా సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. అత్యాచారం కేసులో మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేసారు.
By: Tupaki Desk | 31 March 2025 9:31 AMప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన మోనాలిసా సుపరిచితమే. తిరనాళ్లలో పూసలు వ్యాపారం చేసుకునే మోనాలిసే రాత్రికే రాత్రే సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది. ఆమె అందానికి నెటిజనులు ఫిదా అవుతు నెట్టింట షేర్ చేసిన పోస్టులతో సంచలనంగా మారింది. బాలీవుడ్ హీరోయిన్లను మంచి ఫాలోయింగ్ రాత్రికి రాత్రే దక్కించుకుంది.
దీంతో మోనాలిసాకు బాలీవుడ్ లో సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. టాలీవుడ్ లో కూడా ఛాన్స్ లివ్వడానికి కొంత మంది మేకర్స్ సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున షాప్ ఓపెనింగ్ కార్యక్రమాల్లో కూడా మోనాలిసా పాల్గొంది. ఇదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను కలవడం...సినిమా ఛాన్స్ ఇవ్వడం అంతా వేగంగా జరిగిపోయింది. ఆమెని హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తానని ప్రకటించాడు.
అయితే తాజాగా సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. అత్యాచారం కేసులో మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేసారు. ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఫిర్యాదు చేసిన మహిళ వివరాలు గోప్యంగా ఉన్నాయి.
సనోజ్ మిశ్రా బాలీవుడ్ లో ఓ పది సినిమాలకు దర్శకత్వం వహించాడు. బీట్యాడ్ సినిమాతో అతడు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. అటుపై 'గాంధీగిరి' చిత్రాన్ని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించాడు.'రామ్ కీ జన్మభూమి', 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' సహా పలు చిత్రాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం 'కాశీ టూ కశ్మీర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.