Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే శంక‌ర్ ఇమేజ్ సంగ‌తేంటి?

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శ‌కుడు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 6:18 AM GMT
అదే జ‌రిగితే శంక‌ర్ ఇమేజ్ సంగ‌తేంటి?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శ‌కుడు. ఆయ‌న నుంచి ఎన్నో అద్భుత‌మైన చిత్రాలొచ్చాయి. ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు, త‌న‌దైన మార్క్ సందేశాన్ని అందించ‌డం శంక‌ర్ సినిమాల ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టి వ‌ర‌కూ శంక‌ర్ నుంచి రిలీజ్ అయిన సినిమాల‌న్నీ అలాగే ఉంటాయి. జెంటిల్మెన్ ద‌గ్గ‌ర నుంచి ఇండియ‌న్ -2 వ‌ర‌కూ అన్ని సినిమాల్లో ఓ సందేశం క‌నిపిస్తుంది.

ఇక ద‌ర్శ‌కుడిగా శంక‌ర్ సాధించిన బాక్సాఫీస్ రికార్డుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించిన తొలి సౌత్ ద‌ర్శ‌కుడు అయ‌నే. ఇంకా చెప్పాలంటే దేశంలోనే ఆ ఘ‌న‌త సాధించింది తొలుత అత‌డే. జ‌పాన్, చైనా లాంటి దేశాల్లో శంక‌ర్ సినిమాలంటే ఎంతో మంది ఆద‌రిస్తారు. అక్క‌డ అయ‌న కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఇండియ‌న్ స్క్రీన్ పై `రోబో` లాంటి అద్భుతం ఆయ‌న నుంచే సాధ్య‌మైంది.

టెక్నిక‌ల్ సినిమాలు చేయాల‌న్నా? అందులో ఎమోష‌న్ పండిచ‌ల‌న్నా? అది కేవలం శంక‌ర్ కి మాత్ర‌మే సాధ్య‌మైంది. అలాంటి శంక‌ర్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో క‌నిపిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో శంక‌ర్ సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఇటీవ‌ల భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన `ఇండియ‌న్ -2` డిజాస్ట‌ర్ అయింది. రొటీన్ సినిమా తీసాడ‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు.

శంక‌ర్ మార్క్ ఎక్క‌డ‌? అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ రెయిజ్ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా `ఇండియ‌న్ -3` చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారు? అన్న అంశం సంచ‌ల‌నంగా మారింది. థియేట్రిక‌ల్ బిజినెస్ ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌నే అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారుట‌. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. అయితే శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమా ఓటీటీ రిలీజ్ అన్న‌ది అత‌డి ఇమేజ్ పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు.