Begin typing your search above and press return to search.

విశ్వంభర రిలీజ్.. దర్శకుడు ఏమన్నాడంటే..

తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వశిష్టను విశ్వంభర రిలీజ్ డేట్ గురించి అడుగగా. దీనిపై ఆయన స్పందిస్తూ,

By:  Tupaki Desk   |   6 Feb 2025 4:07 AM GMT
విశ్వంభర రిలీజ్.. దర్శకుడు ఏమన్నాడంటే..
X

దర్శకుడు వశిష్ట తన మొదటి సినిమా బింబిసారతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విజయం అతనికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇచ్చింది. అదే విశ్వంభర. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట సంక్రాంతి 2025లో విడుదల కావాల్సి ఉండగా, వర్క్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఈ మూవీ అత్యంత భారీ చిత్రంగా నిలవనుందని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ సినిమా పలు గ్రాఫిక్స్ హైలైట్స్‌గా నిలవనున్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, త్రిష కథానాయికగా నటిస్తోంది. భారీ సెట్స్, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతోనే మూవీ విడుదలలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.

తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వశిష్టను విశ్వంభర రిలీజ్ డేట్ గురించి అడుగగా. దీనిపై ఆయన స్పందిస్తూ, "త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది" అని అన్నారు. అంటే ఈ సమ్మర్‌లో సినిమా రాలేదన్న అనుమానం అందరిలోనూ మొదలైంది. అసలు ఈ ఏడాది వస్తుందా? లేక 2025 చివరికి రానుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడైనా సరే, బిగ్ స్క్రీన్‌పై మెగాస్టార్ మ్యాజిక్ చూడటానికి రెడీగా ఉన్నారు.

ఈ సందర్భంలో వశిష్ట సినిమా గురించి చెప్పిన మాటలు మాత్రం హైప్‌ను మరింత పెంచేశాయి. ఆయన మాటల్లోనే, "విశ్వంభర అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచే సినిమా అవుతుంది. ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను" అని అన్నారు. అటు బింబిసార 2 గురించి కూడా అడిగినప్పుడు, "ప్రస్తుతం నేను పూర్తిగా విశ్వంభరపైనే ఫోకస్ చేశాను, మరో సినిమా గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు" అని స్పష్టతనిచ్చారు.

ఇక మెగాస్టార్ చిరంజీవికి ఇదో ప్రత్యేకమైన చిత్రం అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరు కెరీర్‌లో ఎప్పుడూ చేయని కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతోందట. గాడ్‌లెవల్ విజువల్స్, గ్రాఫిక్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఎప్పుడూ మాస్, కమర్షియల్ కథలు చేయడంలో ముందుండే చిరు, ఈసారి ఫుల్‌గా వశిష్ట స్టైల్‌లో కొత్తదనం చూపించబోతున్నారన్న టాక్ ఉంది.

మొత్తంగా చూస్తే, విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారికంగా విడుదల తేదీ రాకముందే ఇంతగా హైప్ రావడం చూస్తుంటే, సినిమా థియేటర్లలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. మెగాస్టార్ అభిమానులకు ఇది మరో విజువల్ ట్రీట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.