Begin typing your search above and press return to search.

'సరిపోదా శనివారం' కంటే 'అంటే..' ఎక్కువ ఇష్టం

టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ దర్శకులలో వివేక్ ఆత్రేయ ఒకరు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 11:30 PM GMT
సరిపోదా శనివారం కంటే అంటే.. ఎక్కువ ఇష్టం
X

టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ దర్శకులలో వివేక్ ఆత్రేయ ఒకరు. “మెంటల్ మదిలో” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వివేక్ ఆత్రేయ తరువాత “బ్రోచేవారెవరురా” మూవీ చేశాడు. ఈ రెండు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. డీసెంట్ కామెడీతో వివేక్ ఈ రెండు చిత్రాలతో ప్రేక్షకులని మెప్పించాడు. నేచురల్ స్టార్ నానితో “అంటే సుందరానికి” అనే సినిమా చేశాడు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మరల కొంత గ్యాప్ తీసుకొని నానితోనే “సరిపోదా శనివారం” మూవీ చేశారు. ఆగష్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఐదు రోజుల్లో 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని థియేటర్స్ లో వసూలు చేసింది. ఈ మూవీ దసరా సినిమా కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ సక్సెస్ సందర్భంగా వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. “సరిపోదా శనివారం” సినిమా కంటే నాకు “అంటే సుందరానికి” మూవీ వ్యక్తిగతంగా ఇష్టం అని వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. “అంటే సుందరానికి” సినిమాకి థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ స్క్రిప్ట్ పరంగా ఆ కథ నాకు బాగా సంతృప్తినిచ్చింది.

అయితే “సరిపోదా శనివారం” మూవీ బాగా ప్యాక్ చేయబడిన స్క్రిప్ట్ అందుకే కమర్షియల్ మంచి విజయాన్ని అందుకుంది. కానీ రచయితగా మాత్రం నేను “అంటే సుందరానికి” కథని ఎక్కువగా ఇష్టపడతానని వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఓటీటీలో చూసిన తర్వాత “అంటే సుందరానికి” సినిమా చాలా మందికి నచ్చింది.

అయితే ఎందుకనో థియేటర్స్ లో మాత్రం పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. మూవీ ల్యాగ్ ఎక్కువగా ఉండటం వలన ఫెయిల్ అయ్యిందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపించింది. నానికి “అంటే సుందరానికి” సినిమాతో ఇవ్వలేని సక్సెస్ ని వివేక్ ఆత్రేయ “సరిపోదా శనివారం”తో ఇచ్చాడు. నాని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల ప్రభావం లేకుండా ఉంటే ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ ని “సరిపోదా శనివారం” మూవీ క్రాస్ చేసేదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.