Begin typing your search above and press return to search.

మంగళవారం దర్శకుడు ఏం చేస్తున్నాడు?

ఆర్ఎక్స్ 100, మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి అజయ్ భూపతి

By:  Tupaki Desk   |   16 July 2024 4:21 AM GMT
మంగళవారం దర్శకుడు ఏం చేస్తున్నాడు?
X

ఆర్ఎక్స్ 100, మహా సముద్రం, మంగళవారం సినిమాలతో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి అజయ్ భూపతి. ఓ కల్ట్ లైన్ తీసుకొని దాంతో ఇంటరెస్టింగ్ లేయర్స్ లో అజయ్ భూపతి కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆర్ ఎక్స్ 100 అలాగే రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మహా సముద్రం మూవీకి మాస్ యాంగిల్ లో కమర్షియల్ టచ్ ఇవ్వడంతో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. మూడో సినిమాగా థ్రిల్లర్ నేపథ్యంలో మంగళవారం అనే మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ చేసింది. ఆమె క్యారెక్టర్ చుట్టూనే కథ తిరుగుతుంది. ప్రియదర్శి కీలక పాత్రలో నటించాడు. మంగళవారం తర్వాత అజయ్ భూపతి చేయబోయే సినిమా ఏంటనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. మంగళవారం మూవీ సీక్వెల్ కి కొద్ది రోజుల క్రితం అజయ్ భూపతి ఎనౌన్స్ చేశాడు. ఈ సారి మరింత ఇంటరెస్టింగ్ స్టోరీలైన్ ని చెప్పబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ చిత్రంలో లీడ్ రోల్ లో ఎవరిని తీసుకుంటారో క్లారిటీ లేదు. మరో వైపు మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ అయ్యిందంట.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథని అజయ్ భూపతి సిద్ధం చేస్తున్నాడంట. ప్రొడ్యూసర్ కి కథ నచ్చడంతో దానిని లాక్ చేసారంట. ఇక ఈ సినిమా కోసం హీరో వేటలో పడ్డట్లు తెలుస్తోంది, తెలుగు హీరోలని ముందుగా పరిశీలిస్తున్నారంట. ఒక వేళ సెట్ కాకుంటే బాలీవుడ్ హీరోతో మూవీ చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది. కథ మాత్రం చాలా ఇంటరెస్టింగ్ గా వచ్చిందంట. మంగళవారం సీక్వెల్ కంటే ముందుగా ఈ చిత్రం తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నారంట.

ఒక వేళ హీరోల డేట్స్ అడ్జస్ట్ కాకుంటే మంగళవారం సీక్వెల్ ను వీలైనంత తక్కువ టైంలో ఫినిష్ చేసే పనిలో అజయ్ భూపతి ఉన్నారంట. మరి ఈ రెండింటిలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు ఆల్ మోస్ట్ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తోంది. అజయ్ భూపతి సినిమా కూడా క్యాస్టింగ్ బట్టి బడ్జెట్ పరిధి పెరిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.