లెజెండ్రీ డైరెక్టర్ 'లియో' చేతిలో మోసపోయాడా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నుంచి వచ్చిన సినిమాలు కొన్ని కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకుంటే
By: Tupaki Desk | 20 Oct 2023 6:28 AM GMTబాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నుంచి వచ్చిన సినిమాలు కొన్ని కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకుంటే.. మరి కొన్ని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. మొత్తానికి అనురాగ్ కశ్యప్ ఒక లెజెండ్రీ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ మీడియా వర్గాల వారితో పాటు ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు.
అలాంటి దర్శకుడు ఇప్పుడు నటన వైపు మొగ్గు చూపిస్తున్నారు. దర్శకత్వం చేస్తూ కూడా అప్పుడప్పుడు స్క్రీన్ పై కనిపించిన అనురాగ్ కశ్యప్ ఈ మధ్య కాలంలో తాను రూపొందించిన సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలను ఇవ్వక పోవడం తో నటనపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తద్వారా ఆయనకు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.
దసరా కనుకగా వచ్చిన లియో సినిమా లో అనురాగ్ కశ్యప్ కనిపించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ తనకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అద్భుతమైన పాత్ర ఇచ్చాడు... ఓ గొప్ప పాత్ర ను నేను పోషించినందుకు సంతోషంగా ఉంది.. జన్మ ధన్యం అయింది అన్నట్లుగా అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా లియో విడుదల అయింది. సినిమా లో అనురాగ్ కశ్యప్ పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుందని... సినిమా లో కీలక పాత్ర అయి ఉంటుందని ఆశించే వారికి తీవ్ర నిరాశ తప్పదు. ఇలా వచ్చి అలా వెళ్లి పోయే పాత్ర లో అనురాగ్ కశ్యప్ కనిపించాడు. ఇలా వచ్చి అలా చనిపోయి కనిపించకుండా పోయే పాత్ర లో అనురాగ్ ను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
లెజెండ్రీ దర్శకుడికి ఇలాంటి పాత్ర చేయాల్సిన కర్మ ఏంట్రా బాబు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అనురాగ్ కశ్యప్ కి కాస్త ఎక్కువ లెంగ్త్ ఉన్న రోల్ అని చెప్పి తీసుకుని.. షూటింగ్ కూడా చేసి ఆ తర్వాత సినిమా నిడివి ఎక్కువ అయిందని తొలగించి ఉంటారు అంటూ కొందరు ఊహిస్తున్నారు. అదే నిజం అయితే లియో చేతిలో అనురాగ్ కశ్యప్ దారుణంగా మోసపోయినట్లే...!