Begin typing your search above and press return to search.

శృం*గార ప‌రిశ్ర‌మ‌తోనే సాంకేతిక విప్ల‌వం!

సినిమా వీక్ష‌ణలో నాణ్య‌త అంత‌కంత‌కు పెరుగుతోంది. వీక్ష‌ణ‌ ప‌రంగా సాంకేతిక‌త రాను రాను అనూహ్య మార్పుల‌కు గుర‌వుతోంది.

By:  Tupaki Desk   |   21 March 2024 9:24 AM GMT
శృం*గార ప‌రిశ్ర‌మ‌తోనే సాంకేతిక విప్ల‌వం!
X

సినిమా వీక్ష‌ణలో నాణ్య‌త అంత‌కంత‌కు పెరుగుతోంది. వీక్ష‌ణ‌ ప‌రంగా సాంకేతిక‌త రాను రాను అనూహ్య మార్పుల‌కు గుర‌వుతోంది. ఇప్పుడు ఓటీటీ.. డిజిటల్ స్ట్రీమింగ్ ట్రెండ్ కొన‌సాగుతోంది. అయితే మారుతున్న సాంకేతిక‌త‌కు శృం8గార సినిమాల ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య ఒక పెద్ద టెక్నిక‌ల్ లంకె ఉంద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వ్యాఖ్యానించాడు.

నిజానికి వీసీఆర్ లు డీవీడీల క‌ల్చ‌ర్ .. హెచ్.డి క్వాలిటీతో విజువ‌ల్ స్ట్రీమింగ్... వీఆర్ పీవోవి ఫిలిం మేకింగ్ టెక్నిక్.. ఇవ‌న్నీ ఎక్క‌డి నుంచి పుట్టుకొచ్చాయి? అన్న ప్ర‌శ్న వేస్తే .. వీట‌న్నిటినీ ఒకే గాట‌న క‌ట్టేసిన అత‌డు ఇవ‌న్నీ పుట్టుకొచ్చింది శృం*గార చిత్రాల ప‌రిశ్ర‌మ నుంచే అని చెప్పుకొచ్చారు. శృం*గార సినిమాల‌ను సాధ్య‌మైనంత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాలంటే సునాయాసంగా వీక్ష‌ణ‌కు సాధ్య‌ప‌డే సాంకేతిక‌త‌ను క‌నిపెట్టాలి. ఆ విధంగా నాణ్య‌త కోసం కృషి జ‌రిగింద‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు విశ్లేషించారు.

వీసీఆర్ - డీవీడీ సిస్ట‌మ్స్ ను హెచ్.డి సినిమా వీక్ష‌ణ‌ను క‌నుగొన్న‌ది పో* ప‌రిశ్ర‌మ అని అత‌డు తెలిపాడు. ఓటీటీ స్ట్రీమింగ్ రంగంలోను పెను మార్పుల‌కు స‌ద‌రు ప‌రిశ్ర‌మ‌తో సంబంధం ఉంద‌ని కూడా అత‌డు వ్యాఖ్యానించాడు. తాజా పాడ్ కాస్ట్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు (ఎవ‌రు అన్న‌ది అప్ర‌స్తుతం) చెప్పిన విష‌యాలు యువ‌త‌రం దృష్టిని ఆక‌ర్షించాయి. దీనిపై ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ల‌తో యువ‌త‌రం స్పందిస్తున్నారు. శృంగార ప‌రిశ్ర‌మ కోసం సాంకేతిక‌త అభివృద్ధి చెందినా కానీ, మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఈ సాంకేతిక‌త అనువుగా మారింది. ఇది గొప్ప సాంకేతిక విప్ల‌వానికి దారి తీసింది. పో*గ్ర‌ఫీ ప‌రిశ్ర‌మలు మిలియ‌న్ ట్రిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌తో అజేయంగా కొన‌సాగుతున్నాయి.