డైరెక్టర్స్ డేలో డైరెక్టర్స్ మిస్సింగ్?
తెలుగు దర్శకుల సంఘం నిర్వహించిన డైరెక్టర్స్ డే వేడుకలో ఆశించిన స్థాయి గ్లింప్స్ మిస్సయ్యాయి.
By: Tupaki Desk | 20 May 2024 6:42 AM GMTతెలుగు దర్శకుల సంఘం నిర్వహించిన డైరెక్టర్స్ డే వేడుకలో ఆశించిన స్థాయి గ్లింప్స్ మిస్సయ్యాయి. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ గచ్చిబౌళి స్టేడియంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకలో తెలుగు సినీపరిశ్రమ నుంచి దిగ్గజ దర్శకులు సహా పరిశ్రమ సూపర్ స్టార్లు, ఇతర అగ్ర సాంకేతిక నిపుణులు హాజరవుతారని చాలా ప్రచారం సాగింది.
ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, బోయపాటి శ్రీను సహా పలువురు దిగ్గజ దర్శకులు ఎటెండవుతారని భావించారు. అలాగే పరిశ్రమ అగ్ర హీరోలు చిరంజీవి, మహేష్, ప్రభాస్, చరణ్ వంటి స్టార్లు అటెండవుతారని ఆశించారు. కానీ ఈసారి ఈవెంట్ కి ఆశించినంత మంది సినీపెద్దలు వచ్చినట్టు కనిపించలేదు.
ఈ వేడుకలో కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, సీనియర్ నటుడు మురళి మోహన్, నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, కార్తికేయ వంటి స్టార్లు మాత్రమే అటెండయ్యారు. పరిశ్రమ పెద్ద ప్రసాద్ లాబ్స్ రమేష్ ప్రసాద్, దర్శకుడు వీరశంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో అనీల్ రావిపూడి పేరడీ స్కిట్ లు అలరించాయి. అయితే ఈ వేడుకను దర్శకులు ముందుండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహించారంటూ వేదికపై అల్లు అర్జున్ ప్రశంసించడం గమనార్హం. ముఖ్యంగా ఇలాంటి కీలకమైన వేడుకకు రాజమౌళి- త్రివిక్రమ్- సుకుమార్ వంటి దర్శకులు మిస్సవ్వడంతో కళ తప్పిందని అభిమానులు భావిస్తున్నారు.