Begin typing your search above and press return to search.

ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న దర్శకుడు..!

సినిమా హిట్ అయితే ఎలా పైకి లేపుతారో అదే సినిమా ఫ్లాపైతే వారి పరిస్థితి తెలిసిందే. ప్రస్తుతం అలాంటి బ్యాడ్ ఫేజ్ ని ఎదుర్కొంటున్నాడు హిందీ దర్శకుడు దేవాశిష్ మఖిజా.

By:  Tupaki Desk   |   16 March 2024 12:30 PM GMT
ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న దర్శకుడు..!
X

సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ సక్సెస్ కొట్టిన వారికే భారీ డిమాండ్. టాలెంట్ చూపిద్దామని వచ్చి ఇక్కడ సరైన అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఎంత కష్టపడ్డా కూడా ఎంతో కొంత లక్ ఫేవర్ చేస్తేనే కానీ సినీ పరిశ్రమలో రాణించగలమని అంటారు. ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే ఒక దర్శకుడు ప్రస్తుతం తన ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడట. ఈ విషయాన్ని అతనే వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరచేలా చేస్తుంది.

సినిమా హిట్ అయితే ఎలా పైకి లేపుతారో అదే సినిమా ఫ్లాపైతే వారి పరిస్థితి తెలిసిందే. ప్రస్తుతం అలాంటి బ్యాడ్ ఫేజ్ ని ఎదుర్కొంటున్నాడు హిందీ దర్శకుడు దేవాశిష్ మఖిజా. దర్శక నిర్మాతగా మారి ఆయన చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. దేవాశిష్ మఖిజా తెరకెక్కిన జోరమ్ సినిమా ఈమధ్యనే రిలీజైంది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులేక ఇబ్బందులు పడుతున్నానని ఆయన వెల్లడించారు.

సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు అవుతుంది. తన వయసు 40 ఏళ్లు. ప్రస్తుతం కనీసం సైకిల్ కొనేందుకు కూడా తన దగ్గర డబ్బులేవని అన్నారు. తాను ఎన్నో సినిమాలు తీసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయా.. జోరం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాలేదని. అందుకే దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అన్నారు దేవాశిష్ మఖిజా.

ఇంటి రెంట్ కట్టే పరిస్థితి లేదని.. తనను బయటకు గెంటేయొద్ధని ఓనర్ ని బతిమిలాడుతున్నా అని అన్నారు. ఇంకా తన దగ్గర 20 స్క్రిప్ట్ లు ఉన్నాయి. వాటిని నిర్మించేందుకు కూడా ఎవరు ముందు రావట్లేదని అన్నారు దేవాశిష్ మఖిజా. తన విషయంలో జరిగినట్టుగా మిగతా వారి విషయాల్లో జరగకూడదని.. ప్రతి ఒక్కరు ఆర్ట్, కామర్స్ మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని.. ఈ విషయాన్ని తాను ఆలస్యంగా తెలుసుకున్నానని అన్నారు దేవాశిష్ మఖిజా.

షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవాశిష్ మఖిజా 2017 లో అజ్జి సినిమాతో ఇండస్ట్రీలో తొలి ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్ హిట్ కాలేదు. ఆ తర్వాత దేవాశిష్ మఖిజా తీసిన భోంస్లే సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందింది. రీసెంట్ గా జోరమ్ సినిమా చేసిన దేవాశిష్ మఖిజా సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినా డబ్బులు తీసుకు రాలేకపోయిందని తెలుస్తుంది.