గుణశేఖర్ అక్కడ నుంచి ఇక్కడికిలా!
వీటన్నింటికంటే ముందే చిరంజీవితో 'చూడాలని వుంది' లాంటి వైవిథ్యమైన సినిమాని తెరకెక్కించారు.
By: Tupaki Desk | 29 May 2024 7:30 AM GMTటాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గుణేశేఖర్ సక్సెస్ స్టోరీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లాఠీ' దర్శకుడిగా పరిచయమైన 'ఒక్కడు' తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత గుణ కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. అదే వేవ్ లో మహేష్ తో 'అర్జున్'..'సైనికుడు' లాంటి విజయాలు అందుకున్నారు. అటుపై తెరకెక్కించిన 'వరుడు'..'నిప్పు' లాంటి చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. వీటన్నింటికంటే ముందే చిరంజీవితో 'చూడాలని వుంది' లాంటి వైవిథ్యమైన సినిమాని తెరకెక్కించారు.
ఇక 2015 తర్వాత గుణశేఖర్ రొటీన్ సినిమాలకు దూరమయ్యారు. ట్రెండ్ తో పాటు మనం మారాలని భావించిన గుణశేఖర్ భారీ కాన్వాస్ పై 'రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఆ సినిమా దర్శకుడిగా ఆయన స్థాయిని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటివరకూ కమర్శియల్ సినిమాలు చేసిన గుణ అండ్ కో ఒక్కసారిగా రూట్ మార్చి చరిత్ర కథల్లోకి వెళ్లడంతో టాలీవుడ్ ట్రెండ్ ని మార్చినట్లు అయింది. ఆ తర్వాత సమంతతో 'శాకుంతంలం' అనే మరో చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలం దుకున్నారు.
అయితే ఈ సినిమా కమర్శియల్ గా అనుకున్నంత ఫలితాలు సాధించలేదు. ఈ సినిమాల కోసం గుణశేఖర్ కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. తమ సొంత సంస్థతో పాటు ఇతర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో వాటిని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గుణశేఖర్ అంటూ దర్శక-నిర్మాతగా ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించారు. అయితే ఇప్పుడాయన ఒక్కసారిగా కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లోనే ఈసినిమా నిర్మిస్తున్నారు. 'యూఫోరియా' అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇంతవరకూ గుణశేఖర్ కొత్త నటీనటులతో సినిమాలు చేసింది లేదు. దర్శకుడిగా ఆయన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేసారు. కానీ నేడు సన్నివేశం అందుకు భిన్నం. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఇతర సినిమా షూట్లలో బిజీగా ఉన్నారు. టైర్ -2 హీరోలు కూడా ఖాళీగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్లకోసం ఎదురు చూడటం కంటే ఓ ప్రయత్నంగా కొత్త వారితే చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.