హోటల్ గదిలో 'జీఎస్టీ' డైరెక్టర్ ఆత్మహత్య!
కూకట్ పల్లి భాగ్యనగరి కోలనీలోని ఆనంద్ ఇన్ ఓయో లాడ్స్ లో ప్యాన్ కి ఉరేసుకుని మరణించాడు.
By: Tupaki Desk | 6 Aug 2024 12:30 PM GMTటాలీవుడ్ డైరెక్టర్ కొమారి జానయ్య అలియాస్ జానకీరామ్ (44) హోటల్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్ పల్లి భాగ్యనగరి కోలనీలోని ఆనంద్ ఇన్ ఓయో లాడ్స్ లో ప్యాన్ కి ఉరేసుకుని మరణించాడు. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జానయ్య చెకౌట్ చేయాల్సిన సమయం దగ్గరపడటంతో లాడ్జి సిబ్బంది గది తలుపులు తట్టగా ఎంతకీ తీయలేదు.
దీంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఫ్యాన్ కి ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. లాడ్జికి ఒక్కడే వచ్చాడా? అతనితో పాటు ఇంకేవరైనా వచ్చారా? ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆది వారమే చోటు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొమారి జానయ్య సొంతంగా తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ స్థాపించారు. 'జీఎస్టీ' అనే చిత్రాన్ని తానే స్వీయా దర్శకత్వంలో సొంత బ్యానర్ పై నిర్మించారు.
జానకీ రామ్ ది నాగర్ కర్నూల్. కొంత కాలంగా ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. జీఎస్టీ సినిమా అతడిని ఆర్దికంగా మరింత ఇబ్బందులకు గురి చేసినట్లు వినిపిస్తుంది. 2021 లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాకి నష్టాలు తప్పలేదు. సొంత బ్యానర్ లో సినిమా కాబట్టి నష్టం మొత్తం మోయాల్సిన పరిస్థితి. దీంతో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలు పోలీసులు, కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సి ఉంది.
జి ఎస్ టి అంటే గాడ్, సైతాన్, టెక్నాలజీ. ప్రస్తుత ప్రపంచంలో భక్తి పేరుతో సైతాన్ పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. టెక్నాలజీ లో అప్ డేట్ కాకపోవడం వల్లనే అలాంటివి జరుగుతున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. వాటన్నిటికీ సమాధానంగా జి ఎస్ టి ని తెరకెక్కిస్తున్నట్లో రిలీజ్ సమయంలో జానకీరామ్ తెలిపారు.