Begin typing your search above and press return to search.

భోళాశంకర్ దెబ్బకు కొరటలపై పెరుగుతున్న పాజిటివిటీ

టాలీవుడ్ అగ్రహీరోగా ఇంకా కెరీర్ లో కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

By:  Tupaki Desk   |   13 Aug 2023 11:30 AM GMT
భోళాశంకర్ దెబ్బకు కొరటలపై పెరుగుతున్న పాజిటివిటీ
X

టాలీవుడ్ అగ్రహీరోగా ఇంకా కెరీర్ లో కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక అందుకున్న అతిపెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ - చిరంజీవి కలిసి నటించినా ప్రేక్షకులకు ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో ఆ సమయంలో దర్శకుడు కొరటాల శివపై ఫుల్ నెగెటివిటీ వచ్చింది. సినిమా ప్లాప్ కు కారణం దర్శకుడే అన్నట్లుగా తెగ ప్రచరాం చేశారు.

అయితే తాజాగా విడుదలైన చిరు భోళా శంకర్ డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ కొరటాల శివ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సారి నెగటివ్ కాకుండా పాజిటివ్ గా అవుతోంది. వాస్తవానికి ఆచార్య ఫ్లాప్ అయినప్పుడు ఆచార్య ఓటమికి కొరటాల శివనే కారణమన్నట్లుగా చిరు కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అటు ఆచార్య ఫ్లాప్ కావడం, చిరు ఆయన్ను నిందించడంతో.. దేవర సినిమా విషయంలో అభిమానులకు ఫుల్ టెన్షన్ మొదలైంది. ఈ చిత్రం అనౌన్స్ చేశాక సెట్స్ పైకి వెళ్లడానికి చాలా కాలం పట్టింది. దీంతో అభిమానులు మరింత ఆందోళన చెందారు. దేవర సినిమా విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని గట్టిగా సూచించారు. ఇక చిరు వాల్తేరు వీరయ్య హిట్ అయినప్పుడూ శివపై మరింత ట్రోలింగ్ చేశారు.

కానీ వీటిపై శివ ఎప్పుడూ స్పందించలేదు. కేవలం తన పనితనంతోనే సమాధానం చెప్పాలనుకున్నారో ఏమో.. అందుకే కాస్త ఆలస్యమైనా దేవర కోసం చాలా ఫోకస్డ్ గా పనిచేస్తున్నారు. ఎక్కడా ఏ మాత్రం రాజీపడకుండా సినిమా చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు భోళాశంకర్ డిజాస్టర్ అవ్వడంతో శివపై ట్రోల్ చేయడం ఆపేసి, కాస్త పాజిటివ్ గా స్పందిస్తున్నారు అభిమానులు.

కొరటాల శివ తప్పకుండా దేవరతో సక్సెస్ అందుకుని తాను అందుకున్న విమర్శలకు గట్టిగా చెక్ పెడతారని అనడం ప్రారంభించారు నెటిజన్లు. ఆయనకు ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నారు. అలాగే చిరు.. అప్పుడు కొరటాల శివను అన్నట్టుగా ఇప్పుడు మెహర్ రమేశ్ ను కూడా బ్లేమ్ చేస్తారా అని తెగ చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ భోళాశంకర్ డిజాస్టర్ అందుకోవడంతో కొరటాలపై మాత్రం కాస్త ట్రోలింగ్ తగ్గి పాజిటివ్ రెస్పాన్స్ పెరిగిందనే చెప్పాలి.