Begin typing your search above and press return to search.

లోకేష్ లైనప్.. ప్రభాస్ ప్రాజెక్ట్ అప్పుడే..

2017లో 'మానగరం'తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత 'ఖైదీ', 'మాస్టర్‌', 'విక్రమ్‌' చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ క‌న‌గ‌రాజ్.

By:  Tupaki Desk   |   6 Aug 2023 7:28 AM GMT
లోకేష్ లైనప్.. ప్రభాస్ ప్రాజెక్ట్ అప్పుడే..
X

2017లో 'మానగరం'తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత 'ఖైదీ', 'మాస్టర్‌', 'విక్రమ్‌' చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ క‌న‌గ‌రాజ్. పాన్ ఇండియా రేంజ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ మాఫియా, పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రాలను తెరకెక్కిస్తూ.. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.

అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు లోకేష్ తో ప‌నిచేయ‌డానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఆయ‌న ఊ అంటే చాలు.. వచ్చి వాలిపోవ‌డానికి రెడీగా ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలే క్యూలో ఉంటున్నారంటే... ప్రస్తుతం లోకేష్ మార్కెట్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతోంది. ఇప్పుడు లోకేష్ ను లాక్ చేస్తే మ‌రో రెండు, మూడేళ్ల త‌ర్వాతైనా సినిమా చేయోచ్చ‌న్న‌ది దర్శకనిర్మాతలు, హీరోల ప్లాన్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న లోకేష్.. తన యూనివర్స్ లో భాగంగా ఇళయ దళపతి విజయ్ తో 'లియో' అనే భారీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత లోకేష్ లైనప్ భారీ రేంజ్ లో ఉంది. ఇందులో అందరూ పాన్ ఇండియా స్టార్సే ఉండటం విశేషం.

లోకేశ్ లియో తర్వాత తన సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయనున్నారు. ఇది రజనీ 171వ సినిమాగా రాబోతుంది. ఈ కాంబో గురించి రీసెంట్ గా క్లారిటీ వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది 2024లో వచ్చే అవకాశం ఉంది.

రజనీ చిత్రం పూర్తవ్వగానే లోకేశ్ ఫోకస్ 'ఖైదీ 2'పై పెట్టనున్నారు. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ ఎంతటి సంచలనం క్రియేట చేసిందో తెలిసిన విషయమే. దీనికి సీక్వెల్ గానే ఖైదీ 2ను రూపొందించనున్నారు లోకేశ్. ఇది 2025లో అభిమానులను అలరించనుంది.

అలాగే దీని తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయనున్నారు లోకేష్. ఈ చిత్రాన్ని ఎవరూ ఊహించని స్థాయిలో రూపొందించబోతున్నట్లు ఆ మధ్యలో లోకేష్ చెప్పినట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ భారీ చిత్రాన్ని 2026లో పాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రాలన్నింటినీ లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లింక్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.