ఆ స్టార్ డైరెక్టర్ ఎందుకిలా సాగదీస్తున్నాడు?
ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన `లియో` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Oct 2023 11:30 PM GMTసినిమా హిట్ అయిందా? ఫట్ అయిందా? అన్నదే ముఖ్యమే. హిట్ అయితే సంబరాలు...సక్సెస్ మీట్లు.. ప్లాప్ అయితే సైలెంట్ గా ఉండటం. సహజంగా ఈ రెండు సన్నివేశాలే ఏ సినిమాకైనా కనిపిస్తాయి. కానీ `లియో` విషయంలో అందుకున్న భిన్నమైన సన్నివేశం కనిపిస్తుందా? లేక లోకేష్ మార్క్ స్ట్రాటజీతో జనాల్ని కన్ ప్యూజ్ చేస్తున్నాడా? అన్నది ఇప్పుడు కొత్త టాస్క్ గా కనిపిస్తుంది.
ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన `లియో` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజు 140 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రూపంలోనే సాధించింది. అటు పై ఇప్పటివరకూ లెక్క అనధికారికంగా 500 కోట్లగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా పై విమర్శలు తీవ్ర స్థాయిలో తెరపైకి వచ్చాయి. సినిమాపై కథ..కథనాలు కొత్తగా లేవని..విజయ్ ఇమేజ్..లోకేష్ బ్రాండింగ్ తప్ప! అందులో చెప్పుకోదగ్గ విషయం ఏముందని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నించారు.
సినిమాపై నెగిటివ్ కథనాలు తెరపైకి వచ్చాయి. వీటికి కచ్చితంగా బధులిస్తానని లోకేష్ ఆ రెండవ రోజే అన్నాడు. సినిమా హిట్ అంటూనే అన్ని రివ్యూలు చూసుకుని తుదిగా మాట్లాడుతానని..తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెబుతా అన్నాడు. తాజాగా ఈ నయా దర్శకుడు మరోసారి డిపెన్స్ చేసుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. సక్సెస్ విషయంలో విజయ్ ఆనందంగా ఉన్నాడు అన్నారు.
కేరళలో థియేటర్ కి వెళ్లినప్పుడు తనకి చిన్న గాయాలైతే విజయ్ ఫోన్ చేసి మాట్లాడారన్నారు. `సినిమాపై ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి త్వరలోనే బధులిస్తా. సెకెండాఫ్ ఎక్కువైందంటున్నారు. వాళ్ల అభిప్రాయాలు స్వీకరిస్తున్నా. సక్సెస్ మీట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాం` అని స్పందించారు. లోకేష్ వ్యాఖ్యలపై మరోసారి నెట్టింట చర్చ జరుగుతుంది.
సక్సెస్ అయిందా? ఫెయిలైందా? అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టకుండా ఎందుకిలా సాగదీస్తు న్నాడని నెటి జనులు చర్చించుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయి పది రోజులు అయింది. వెళ్లాల్సిన నెగిటివ్..పాజిటివ్ పీడ్ బ్యాక్ వెళ్లింది. కానీ లోకేష్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు.