Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్ డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నాడు?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ ఏడాది వచ్చిన టిల్లు స్క్వేర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 July 2024 7:30 AM GMT
టిల్లు స్క్వేర్ డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నాడు?
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ ఏడాది వచ్చిన టిల్లు స్క్వేర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అతని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ మూవీ సాధించింది. డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చేశారు. అయితే మొదటి సినిమా చేసిన దర్శకుడు కాకుండా సీక్వెల్ ని సిద్దు మల్లిక్ రామ్ దర్శకత్వంలో చేశాడు. అంతకుముందు అద్భుతం అనే సినిమాని మల్లిక్ రామ్ తేజ సజ్జా హీరోగా చేశాడు.

ఆ మూవీ పెద్దగా క్లిక్ కాలేదు. అయితే టిల్లు స్క్వేర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ క్రెడిట్ మొత్తం సిద్దు జొన్నలగడ్డకి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే సిద్దు టిల్లు స్క్వేర్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో చేస్తున్నాడు. అయితే డైరెక్టర్ మల్లిక్ రామ్ నెక్స్ట్ మూవీపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం మల్లిక్ రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సందీప్ కిషన్ తో టై అప్ అయ్యాడంట.

అయితే ఇద్దరు వర్క్ చేస్తుంది మూవీ కోసం కాదని తెలుస్తోంది. ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారంట. చోటా భీమ్ సిరీస్ తో అందరికి చేరువ అయిన రాజీవ్ చిలక ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారంట. రీసెంట్ గా రాజీవ్ చిలక అల్లరి నరేష్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. ఓటీటీలో రాజీవ్ చిలకకి విశేషమైన అనుభవం ఉంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని వెబ్ సిరీస్ చేస్తున్నారంట. త్వరలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కథాంశం ఏంటనేది ఇంకా బయటకి రాలేదు. ఇదిలా ఉంటే సందీప్ కిషన్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీ రాబోతోంది. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు.

దీని తర్వాత వెబ్ సిరీస్ ని సందీప్ కిషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. గతంలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సందీప్ కిషన్ కనిపించారు. దీనికి సీక్వెల్ గా రాబోయే ది ఫ్యామిలీ మెన్ 3లో అతను ఫుల్ లెంత్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు.