Begin typing your search above and press return to search.

రాజా సాబ్ తర్వాత బాలీవుడ్ జంప్..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పక్క వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు

By:  Tupaki Desk   |   29 May 2024 11:30 AM GMT
రాజా సాబ్ తర్వాత బాలీవుడ్ జంప్..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పక్క వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. కల్కి 2898 ADతో చాలా పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నాడు ప్రభాస్. ఆ సినిమాతో పాటుగా మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ మీద వెళ్లే ముందు రెబల్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడినా ఫస్ట్ లుక్ వింటేజ్ ప్రభాస్ ని చూసి ఖుషి అయ్యారు. రాజా సాబ్ సినిమా డిఫరెంట్ కథతో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది.

ఇన్నాళ్లు ఎంటర్టైనర్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన మారుతి ఈసారి తన రేంజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమాతో డైరెక్టర్ గా మారుతి తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశచెందకుండా ఉండేలా సినిమా తీస్తున్నాడని అంటున్నారు. మారుతి డైరెక్షన్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం ఆయన ఫ్యాన్స్ ని మెప్పించేలా చేయడం కాస్త కష్టమే.

అందుకే మారుతి ఎప్పుడు లేని విధంగా రాజా సాబ్ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. మరోపక్క ప్రభాస్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మారుతికి కావాల్సినంత టైం దొరికింది. రాజా సాబ్ సినిమాను కూడా నేషనల్ లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడని అంటున్నారు. రాజా సాబ్ తర్వాత మారుతి కూడా బాలీవుడ్ జంప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పొచ్చు.

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలంతా కూడా తెలుగు దర్శకుల మీద గురి పెట్టుకుని ఉన్నారు. ఛాన్స్ వస్తే మన డైరెక్టర్స్ తో కాంబో ఫిక్స్ చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో రాజా సాబ్ అనుకున్న అంచనాలను అందుకుంటే మాత్రం మారుతి నెక్స్ట్ సినిమా కూడా ఉంటే బాలీవుడ్ హీరోతో చేసేయొచ్చు లేదా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రాజా సాబ్ ఫలితం మీదే మారుతి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అవుతుంది. అయితే రాజా సాబ్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అనుకున్న విధంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.