Begin typing your search above and press return to search.

జైలర్ హిట్ తో ఆ హీరో ఫ్యాన్స్ లో ఆగ్రహం

రజినీకాంత్‌ అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది

By:  Tupaki Desk   |   14 Aug 2023 6:09 AM GMT
జైలర్ హిట్ తో ఆ హీరో ఫ్యాన్స్ లో ఆగ్రహం
X

సూపర్ స్టార్‌ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత రజినీకాంత్ కు ఓ సాలిడ్ సక్సెస్ దక్కిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమల్‌ హాసన్ కి విక్రమ్ సినిమా ఎలా అయితే భారీ విజయాన్ని కట్టబెట్టిందో రజినీకాంత్ కు జైలర్ సినిమా అలాగే భారీ విజయాన్ని సొంతం చేసిందని మీడియా వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తుంది.

రజినీకాంత్‌ అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముందు ముందు భారీ చిత్రాలకు, మరింత మంది సూపర్ స్టార్‌ హీరోల సినిమాలకు నెల్సన్‌ దిలీప్ దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కెరీర్‌ ను కోలమావు కోకిల అనే సినిమాతో ప్రారంభించాడు. ఆ సినిమాలో సీరియస్ పాయింట్ ను తీసుకుని వినోదాన్ని పంచాడు. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో డాక్టర్ అనే సినిమాను రూపొందించాడు. ఆ సినిమా కూడా మంచి వినోదాత్మకంగా సాగడంతో తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

డాక్టర్ తర్వాత సూపర్‌ స్టార్‌ విజయ్ తో బీస్ట్‌ సినిమాను రూపొందించాడు. సినిమా పర్వాలేదు అన్నట్లుగా నడిచింది. సినిమాలో ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఇంకాస్త ఎక్కువగా ఉండి ఉంటే తప్పకుండా భారీ విజయాన్ని బీస్ట్‌ సొంతం చేసుకునేది అనే అభిప్రాయం ఆ సమయంలో అభిమానులతో పాటు రివ్యూవర్స్ వ్యక్తం చేయడం జరిగింది.

బీస్ట్‌ సినిమాలో లోపించిన ఎంటర్‌ టైన్మెంట్‌ ను జైలర్‌ లో దర్శకుడు నెల్సన్‌ చూపించడం వల్లే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. జైలర్‌ సినిమా హిట్ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ అభిమానులు బీస్ట్‌ సినిమా విషయం లో ఎందుకు అలా చేశావు అంటూ ప్రశ్నిస్తున్నారు. బీస్ట్‌ లో ఎంటర్‌ టైన్మెంట్‌ ఉండి ఉంటే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునేది అంటూ విజయ్ అభిమానులు ఇప్పుడు నెల్సన్‌ దిలీప్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.