పూనమ్ కంట్రవర్సీలోకి ఎంటరైన ఆర్జీవీ..!
ఆమె హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని టాలీవుడ్ లో అడుగుపెట్టింది కానీ నటిగా కంటే కాంట్రవర్సీలతోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు
By: Tupaki Desk | 3 Aug 2023 9:42 AM GMTపూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. ఆమె హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని టాలీవుడ్ లో అడుగుపెట్టింది కానీ, నటిగా కంటే, కాంట్రవర్సీలతోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ ల గురించే ఎక్కువగా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతూ ఉంటారు. ఆమె కూడా ఎక్కువగా పొలిటికల్ సంబంధింత ట్వీట్స్ చేస్తూ దుమారం రేపుతూ ఉంటారు.
ఇటీవల కూడా ఆమె బ్రో సినిమాపై సెటైరికల్ గా ట్వీట్ చేసింది. ‘ఈ మధ్య కాలంలో రాజకీయాలు అనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయ్.. ఎంటర్టైన్మెంట్ అనేదేమో ఎంతో సీరియస్‌గా మారింది’ అంటూ ట్వీట్ చేసింది. నిజానికి ఆ ట్వీట్ లో ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు, కనీసం ఎవరినీ ట్యాగ్ కూడా చేయలేదు.
కానీ, ఆ ట్వీట్ మాత్రం బ్రో మూవీ గురించే, ముఖ్యంగా పవన్ ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది అంటూ కింద కామెంట్స్ చూస్తే అర్థమౌతోంది. ఇంకేముంది పవన్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా తిట్టడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పుడు ఈ వివాదంలోకి ఆర్జీవీ ఎంటర్ అవ్వడం గమనార్హం. అవును సిస్టర్.. పాలిటిక్స్ అనేది సినిమాలా మారింది.. సినిమా అనేది పొలిటికల్‌గా మారింది అంటూ రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడింది.
ఆర్జీవీ సైతం పవన్ ని, చంద్రబాబుని ట్రోల్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. వారిపై సినిమాలు చేయడం దగ్గర నుంచి , ట్విట్టర్ లో సైతం విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్లీ ఛాన్స్ రావడంతో ఇలా చెలరేగిపోయాడు. ఇక ఈ వివాదం మొత్తం బ్రో మూవీలోని ఓ పాత్ర గురించి కావడం గమనార్హం.
ఈ బ్రో మూవీలో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఏపీ మంత్రి అంబటి రాయుడు గతంలో వేసిన ఓ డ్యాన్స్ ని కమెడియన్ పృథ్వీ చేత అచ్చుగుద్దినట్లు వేయించారు. అక్కడ వివాదం రగిలింది. సినిమా చూస్తే, ఆ సీన్ బాగా పేలింది. కానీ, ఇక్కడ ఏపీలోని అధికార పార్టీ నేతలకు మాత్రం బాగా కాలింది. ముఖ్యంగా అంబటి రాయుడు ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి కూడా విమర్శించడం గమనార్హం.