హీరోల పారితోషికాలపై వర్మ సంచలన వ్యాఖ్యలు!
కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 14 Aug 2023 7:03 AM GMTకొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. 'బ్రో' సినిమాకి పవన్ కళ్యాణ్ ఎంత పారితోషికం తీసుకున్నారో? చెప్పాలంటూ వైకాపా నేతలు డిమాండ్ చేసారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజకీయాల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సీన్ మరింత వెడెక్కింది. రాష్ట్రంలో సమస్యలు పట్టించుకోకుండా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అన్న తరహాలో చిరు చేసిన వ్యాఖ్యలు కాక పుట్టించాయి.
తాజాగా హీరోల పారితోషికాల విషయంలో సంచలన దర్శకుడు రాంగో పాల్ వర్మ చిరంజీవి వ్యాఖ్యలకు మద్దతుగానే మాట్లాడినట్లు కనిపిస్తుంది. 'హీరోలు ఎంతైనా డిమాండ్ చేస్తారు. ఎంతైనా తీసుకుంటారు. అది వాళ్ల తప్పు కాదు. పారితోషికం ఇచ్చేవారిది తప్పు. ఇచ్చే వాడు ఉన్నప్పుడు తీసుకునే వాడు ఎందుకు కాదంటాడు. ఎంత ఇవ్వాలి అన్నది నిర్మాత ఆలోచించుకుని చూడాల్సిన అంశం.
హీరోల విషయంలో కూడా ఇదే లాజిక్ ఉంటుంది. హీరోల పారితోషికంతో ప్రజలపై భారం పడుతుందనే వాదన అంగీకరించను. డిమాండ్-సప్లయ్ ఆధారంగానే హీరోల రెమ్యూనరేషన్లు డిసైడ్ అవుతుంటాయి. హీరోల పారితోషికాలు. వాళ్ల మార్కెట్ వాల్యూ బట్టి వస్తుంది. భారీగా పారితోషికం ఇచ్చామని సినిమా టికెట్ రేట్లు ఎవరూ పెంచరు. టికెట్ రేట్లు పెంపుదల అనేది సినిమా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగూ పెద్ద హీరోల సినిమాలకు రేట్లు పెంచుతున్నారు. చిన్న సినిమాలు పాత రేట్లు ప్రకారం రిలీజ్ అవుతున్నాయి.
ఇదంతా హీరోలకున్న క్రేజ్ మీద ఆధారపడి ఉంటుంద'న్నారు. గతంలో కూడా వర్మ ఇలాగే స్పందించారు. పారితోషికాలు హీరోలు డిమాండ్ చేసినంత నిర్మాతలు ఇస్తున్నారంటే? అది వాళ్ల ఇష్టంగా చెప్పారు. ఆ హీరో పై అంత పెట్టు బడి పెడితే ఇంత వస్తుందని నిర్మాతకు ఓ లెక్క ఉంటుంది. దాని ప్రకారం పెడతారు. కొంత మంది డేట్లు దక్కించుకోవడం అదనంగా చెల్లిస్తారు. ఇలాంటప్పుడు హీరోలు ఎవరి ఎక్కువ చెల్లిస్తే వాళ్లకే డేట్లు ఇస్తారు. దానికి హీరోల్ని తప్పుబట్టాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు.