డైరెక్టర్ కంబ్యాక్ బౌన్స్ బ్యాక్ అయ్యేలా!
కానీ ఇలా దశాబ్ధం తర్వాత కంబ్యాక్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. తాజాగా ఆయన ఉషా పరిణయం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 21 Nov 2023 11:30 PMఒకప్పటి స్టార్ డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. స్వయంవరం..నువ్వు నాకు నచ్చాయ్.. నువ్వే కావాలి..మన్మధుడు.. మల్లీశ్వరి లాంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన విజయ్ భాస్కర్ ఒక్కసారిగా కనుమరుగయ్యారు. ఈ సినిమాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా బిజీ అయిన సమయంలో విజయ్ భాస్కర్ ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆయన చివరిగా 'మసాలా' సినిమా చేసారు.
ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో విజయ్ భాస్కర్ ఇక దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకున్నారు అనుకున్నారంతా. కానీ ఇలా దశాబ్ధం తర్వాత కంబ్యాక్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. తాజాగా ఆయన ఉషా పరిణయం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. లవ్ ఈజ్ బ్యూటీఫుల్ అనేది ఉపశీర్షిక. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. విజయ్ మార్క్ చిత్రంగా కనిపిస్తుంది. శ్రీకమల్.. తాన్వీ ఆకాంక్ష.. సూర్య కీలక పాత్రల్లో తెరకెక్కిస్తున్నారు. ఇది ఆయన మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెలుస్తుంది.
విజయ్ భాస్కర్ సినిమాలంటే బోరింగ్ ఉండవు. కామెడీ..ఫ్యామిలీ ఎమోషన్ తో అద్భుతంగా కథని నడిపించగల దర్శకుడు. ఇప్పటివరకూ ఆయన దర్శక్వం వహించిన చిత్రాల్లో ఎక్కువ విజయాలనే కనిపిస్తాయి. ఫెయిలైన చిత్రాలు ఆయనకు పెద్దగా విమర్శలు తెచ్చిన సినిమాలైతే కాదు. అయితే ఆ సినిమాల వెనుక త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించారు. ఆయన మాటలు..రచన సినిమాకి అదనపు అస్సెట్ గా కలిసొచ్చాయి.
అటుపై విజయ్ భాస్కర్ తో మరికొంత మంది రచయితలు పనిచేసారు గానీ...గురూజీ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేకపోయారు. దూరమైన తర్వాత సినిమాల్లో పస తగ్గింది. మరి చాలా కాలానికి మళ్లీ త్రివిక్రమ్ లేకుండా సీన్ లోకి వస్తున్నారు. మరి ఈ కంబ్యాక్ అయనకు మంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం.