Begin typing your search above and press return to search.

నటుడిగా మారిన దర్సకుడు..!

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరైన శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా తొలి సినిమాతోనే తన ప్రతిభ చాటుకున్నాడు

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:54 AM GMT
నటుడిగా మారిన దర్సకుడు..!
X

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరైన శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా తొలి సినిమాతోనే తన ప్రతిభ చాటుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్, మహేష్ లతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసి హిట్ అందుకున్నారు. తెలుగు తెర మీద మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమా అదే. వెంకటేష్, మహేష్ తమ ఇమేజ్ లకు పూర్తిగా భిన్నంగా నటించిన సినిమా అది. ఆ సినిమాలో అతని టాలెంట్ మెచ్చి మహేష్ బ్రహ్మోత్సవం అవకాశాన్ని ఇచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

బ్రహ్మోత్సవం ఫ్లాప్ శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లో రిస్క్ లో పడేసింది. చాలా గ్యాప్ తర్వాత అసురన్ రీమేక్ ఛాన్స్ వచ్చింది. వెంకటేష్ తో నారప్ప అంటూ తను ఇలాంటి సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు శ్రీకాంత్. ఇక లేటెస్ట్ గా పెద్దకాపు పార్ట్ 1 అంటూ ఒక భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే శ్రీకాంత్ అడ్డాల కూడా సినిమాలో నటిస్తున్నాడట. పెద్దకాపు సినిమా టీజర్ తోనే సినిమాపై ఒక మార్క్ సెట్ చేయగా.. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.

ఈ ట్రైలర్ లో శ్రీకాంత్ అడ్డాల కనిపిస్తారట. అంతేకాదు ఏదో చిన్న క్యామియో రోల్ లా కాకుండా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లోనే శ్రీకాంత్ అడ్డాల నటిస్తున్నారని తెలుస్తుంది. డైరెక్టర్ గా సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది కాబట్టి యాక్టర్ గా బిజీ అవ్వాలనే ఆలోచన ఉంది కాబోలు అందుకే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఇలా యాక్టర్ గా కొత్త టర్న్ తీసుకున్నారు. పెద్దకాపు సినిమా క్లిక్ అయితే నటుడిగా శ్రీకాంత్ ఫుల్ టైం చేసే అవకాశం లేకపోలేదు.

పెదకాపు టైటిల్ తోనే సినిమా ఆడియన్స్ లో బజ్ పెంచగా ఈ సినిమాతో శ్రీకాంత్ మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు. సినిమాలో అతను నటించడం మరో హైలెట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ లు సినిమాల్లో నటించడం అనే ఆనవాయితీ ఇప్పటిది కాదు. దాసరి, కె.విశ్వనాథ్, కోడి రామకృష్ణ లాంటి వారు కూడా సినిమాల్లో నటించారు. ఎస్వీ కృష్ణా రెడ్డి కూడా సినిమాల్లో నటించారు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ముఖానికి మేకప్ వేసుకుని తన టాలెంట్ చూపించబోతున్నాడు. మరి శ్రీకాంత్ డైరెక్టర్ కం యాక్టర్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.