Begin typing your search above and press return to search.

మా ఆవిడ న‌క్లెస్ పెట్టి అప్పు తెచ్చా!

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వంశీ క‌ళాఖండాల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 198-90ద‌శ‌కంలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన గ్రేట్ డైరెక్ట‌ర్

By:  Tupaki Desk   |   28 May 2024 4:30 PM GMT
మా ఆవిడ న‌క్లెస్ పెట్టి అప్పు తెచ్చా!
X

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వంశీ క‌ళాఖండాల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 198-90ద‌శ‌కంలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన గ్రేట్ డైరెక్ట‌ర్. మంచు ప‌ల్ల‌కి, సితార నుంచి ఫ్యాష‌న్ డిజైన‌ర్ వ‌ర‌కూ ఎన్నో గొప్ప చిత్రాలు ఆయ‌న సొంతం. గ్రేట్ డైరెక్ట‌రే కాదు అంత‌కు మించి గొప్ప ర‌చయిత‌గానూ ఆయ‌న‌కంటో ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. మ‌న‌సుకు హాయ్ క‌లిగించే సినిమాలేవైనా ఉన్నాయి? అంటే అవివంశీ చిత్రాలు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఎన్నిసార్లు చూసినా మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే చిత్రాలు ఆయ‌న‌వి. అయితే ఇప్పుడు పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. తాజాగా కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న పేరు మీడియాలో వైర‌ల్ అవుతుంది. అందుకు కార‌ణంగా ఆయ‌న జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న గురించి చెప్ప‌డ‌మే. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. 'మా రామరాజు వాళ్ల ఊళ్లో జరిగిన ఒక సంఘటన నాకు చెప్పాడు.

ఆ ఊరి జమిందారు బంగ్లా నుంచి ఆ ఇంటి ఆడపడుచు కమలావతి ఓ రాత్రివేళ పడవలో పారిపోవడం గురించి విన్నాక, ఇంత సస్పెన్స్ ఏ సినిమాలోను ఉండదని అనిపించింది. ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఇంటికి వస్తే, మా ఆవిడ కిరాణా సరుకులు తీసుకురమ్మని చెప్పింది. నా దగ్గర డబ్బులు లేకపోతే, వెయ్యి రూపాయలకు తన నెక్లెస్ తాకట్టుపెట్టాను. ఈ వెయ్యి రూపాయలతో ఒక నెల గడుస్తుంది . తరువాత పరిస్థితి ఏంటి? అనిపించింది. అప్పుడే నవలల పోటీ అనే ప్రకటన చూశాను.

మొదటి బహుమతి పదివేలు. దాంతో కమలావతి కథను 'మహల్లో కోకిల' పేరుతో నవలగా రాసి పోటీకి పంపించాను. ఆ తరువాత పోస్టుమేన్ ను విసిగించాను. ఓ రోజున శుభవార్త వినిపించాడు. నా కథకు మొదటి బహుమతి వచ్చింది. ఇక ఏడాది ఫరవాలేదు అనుకున్నాను' అని ద‌ర్శ‌కుడు కాక ముందు సంగ‌తి గుర్తు చేసుకున్నారు. సినిమా ఇండ‌స్ట్రీలో డైరెక్ట‌ర్ల క‌ష్టాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి డైరెక్ట‌ర్ అయ్యే వ‌ర‌కూ ఎన్నో భ‌రించాల్సి ఉంటుంది. ఆరోజుల్లో వాట‌న్నింటిని వంశీ సైతం చూసిన‌వారే. 1977 లో 'ఎదురీత' సినిమాతో అసిస్టెంట్ గా వంశీ ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత 'సీతాకోక చిలుక‌' వ‌ర‌కూ ప‌నిచేసారు. అది 1981 లో రిలీజ్ అయింది. 1982 లో వంశీ 'మంచుప‌ల్ల‌కి' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు.