Begin typing your search above and press return to search.

డైరెక్టర్.. రైటర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

హీరో హీరోయిన్.. హీరో డైరెక్టర్.. ఇలా హిట్ కాంబినేషన్స్ పై ఆడియన్స్ క్రేజీగా ఉంటారు. అలానే డైరెక్టర్, రైటర్ కాంబినేషన్స్ కూడా ఒకటి ఉంటుంది

By:  Tupaki Desk   |   10 April 2024 4:56 AM GMT
డైరెక్టర్.. రైటర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
X

హీరో హీరోయిన్.. హీరో డైరెక్టర్.. ఇలా హిట్ కాంబినేషన్స్ పై ఆడియన్స్ క్రేజీగా ఉంటారు. అలానే డైరెక్టర్, రైటర్ కాంబినేషన్స్ కూడా ఒకటి ఉంటుంది. దానికి ఉదహరణగా బాపు రమణల గురించి చెప్పుకుంటారు. వారిద్దరి మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత చాలామంది డైరెక్టర్ రైటర్ కాంబినేషన్స్ కుదిరాయి. రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అందరి దర్శకులతో కూడా మంచి సాన్నిహిత్యం తో ఉండే వారు.

ఈ క్రమంలో శ్రీను వైట్ల, కోనా వెంకట్ కాంబినేషన్ కూడా ఆడియన్స్ కు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించింది. శ్రీను వైట్ల, కోనా వెంకట్ ఈ ఇద్దరితో కలిసి గోపీ మోహన్ ఈ ముగ్గురు కలిసి అద్భుతమైన సినిమాలు అందించారు. ఈ కాంబో సినిమా అంటే పక్కా సూపర్ హిట్ అనేలా చేసుకున్నారు. స్టార్ సినిమా అంటే అన్ని వర్గాల ఆడియన్స్ వస్తారు. కాబట్టి వారిని అన్ని విధాలుగా మెప్పించాలనే ప్రయత్నం చేస్తారు.

ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాల్లో వచ్చే కామెడీ ట్రాక్ వెనక కోనా వెంకట్, గోపీమోహన్ హ్యాండ్ బాగా ఉంటుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల శ్రీను వైట్ల, కోనా వెంకట్ విడిపోవాల్సి వచ్చింది. ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. సైలెంట్ గా కాదు ఇద్దరు కూడా వారి మధ్య గ్యాప్ అందరికీ తెలిసేలా ప్రవర్తించారు.

శ్రీను వైట్ల, కోనా వెంకట్ ఇద్దరు సెపరేట్ అయ్యాక ఇద్దరు అంత గొప్ప ఫాం కొనసాగించలేదు. కోనా వెంకట్ సొంత బ్యానర్ పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల డైరెక్టర్ గా చాలా వెనకపడ్డారు. ప్రస్తుతం శ్రీను వైట్ల గోపీచంద్ తో విశ్వం సినిమా చేస్తున్నాడు. కోనా వెంకట్ తను నిర్మించిన గీతాంజలి మళ్లీ వచ్చింది ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ శ్రీను వైట్ల, కోనా వెంకట్ కలిశారు. విశ్వం సెట్స్ లో కోనా వెంకట్ శ్రీను వైట్ల గోపీ మోహన్ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈ స్టార్ డైరెక్టర్ స్టార్ రైటర్ ని కలిసి చూడటం ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. మరి ఎలాగు కలిశారు కాబట్టి మళ్లీ కోనా వెంకట్, గోపీమోహన్ సపోర్ట్ తో శ్రీను వైట్ల సినిమా చేస్తారేమో చూడాలి.