Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వస్తే ఆ వేవ్ మామూలుగా ఉండదేమో..

తాజాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ నడిచింది. అటు వైసీపీ పార్టీలో కొంతమంది నేతలు జూనియర్ ఎన్టీఆర్ పేరుని విస్తృతంగా తమ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు.

By:  Tupaki Desk   |   12 May 2024 4:05 AM GMT
ఎన్టీఆర్ వస్తే ఆ వేవ్ మామూలుగా ఉండదేమో..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల పైన పెట్టారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తర్వాత రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. కెరియర్ పైన పూర్తిస్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ దృష్టి పెట్టడంతో రాజకీయాల జోలికి అస్సలు వెళ్లడం లేదు. గత ఐదేళ్ల కాలంలో చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏపీ రాజకీయాలలో విస్తృతంగా చర్చలు నడిచాయి.

అయితే తారక్ మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు. తాజాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ నడిచింది. అటు వైసీపీ పార్టీలో కొంతమంది నేతలు జూనియర్ ఎన్టీఆర్ పేరుని విస్తృతంగా తమ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమకు సపోర్ట్ గా ఉన్నారని వైసీపీ తమ ప్రచారంలో చూపించుకునే ప్రయత్నం చేసింది. ఎన్టీఆర్ ఫోటోలని ప్రచార సభలో కూడా హైలైట్ చేశారు.

అలాగే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపించాయి. అభిమానులు ఎన్టీఆర్ నినాదాలు చేస్తూ సభలలో సందడి చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఎన్నికలలో ఎవరికి సపోర్ట్ గా తన వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల షూటింగ్ లతో తారక్ బిజీగా ఉన్నారు. ఓవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే హిందీలో చేస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టిడిపి కూడా ఎన్టీఆర్ సపోర్ట్ కోసం పెద్దగా ప్రయత్నం చేయలేదు. రాజకీయాలకు తారక్ దూరంగా ఉన్న అవి మాత్రం అతన్ని వదలడం లేదు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణలు తాజా ఎన్నికలలో కనిపించాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆ వేవ్ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

తారక్ మాత్రం మరో 10 ఏళ్ల వరకు రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత బడా దర్శకులు సైతం తారక్ తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారని ఆ మధ్య టాక్ వచ్చింది. భవిష్యత్తులో తారక్ నుంచి మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎన్టీఆర్ భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.