Begin typing your search above and press return to search.

థాయ్‌లాండ్ బీచ్‌లో దిశా పటానీ బికినీ షో

ప్ర‌స్తుతం దిశా థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ బీచ్‌లో తన గాళ్స్ గ్యాంగ్ తో చిల్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 11:00 AM GMT
థాయ్‌లాండ్ బీచ్‌లో దిశా పటానీ బికినీ షో
X

బికినీ బీచ్ సెల‌బ్రేషన్స్ లో చెల‌రేగిపోవ‌డం ఎలానో దిశా పటానీకి నేర్పాల్సిన ప‌ని లేదు. బికినీలు, స్విమ్ సూట్ల‌తో అగ్గి రాజేయ‌డంలో దిశా ఇప్ప‌టికే పీహెచ్‌డి పూర్తి చేసింది. లోదుస్తుల కంపెనీ కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన్నేళ్లుగా అలుపెర‌గ‌కుండా సేవ‌లందిస్తున్న‌ ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే.


ప్ర‌స్తుతం దిశా థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ బీచ్‌లో తన గాళ్స్ గ్యాంగ్ తో చిల్ చేస్తోంది. ప్ర‌స్తుత‌ బీచ్ డేస్‌ను చాలా స్పెష‌ల్ గా ప్లాన్ చేసింది దిశా. ఇటీవల తన ఇన్‌స్టాలో ఓ మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది. ఈ సెల్ఫీ నిజంగా స్ట‌న్న‌ర్.. దిశాలోని హై స్టైల్ ఎనర్జీ ఈ లుక్ లో క‌నిపిస్తోంది.


నారింజ పూల డీటెయిలింగ్ తో రూపొందిన‌ పసుపు రంగు బికినీలో దిశా మైండ్ బ్లాక్ చేసింది. తనదైన స్టైలిష్ లుక్‌తో హాలిడేని స్పెష‌ల్ గా మార్చింది. అందమైన గొలుసు నెక్‌లైన్ ... లోవెయిస్ట్ బికినీ బాటమ్స్‌తో మైండ్ బ్లాక్ చేసింది. ఈ హాలీడే ట్రిప్ లో దిశాతో పాటు చిల్ చేస్తున్న గాళ్స్ గ్యాంగ్ లో టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణ ష్రాఫ్.. మౌని రాయ్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ పూల్ సైడ్ ట్రీట్ ని ఆస్వాధిస్తూ దుమ్ము రేపుతున్నారు. థాయ్‌లాండ్ వెకేషన్ సూపర్ స్టైలిష్‌గా మారింది. ఆ ముగ్గురూ క‌లిసి ఉన్న ఫోటోలు కూడా వైర‌ల్ గా మారుతున్నాయి.


దిశా ప‌టానీ ఇటీవ‌ల వ‌రుస‌గా సౌత్ లో పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తోంది. క‌ల్కి 2898 ఏడి త‌ర్వాత ఇటీవ‌లే సూర్య కంగువ‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు హిందీలోను ఈ భామ వెల్ కం టు ది జంగిల్ అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తోంది.