దిశాపటానీ తండ్రిని మోసం చేసిన కేటుగాళ్లు!
బాలీవుడ్ నటి దిశాపటానీ సుపరిచితమే. అమ్మడికి నటిగా మంచి గుర్తింపు ఉంది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
By: Tupaki Desk | 16 Nov 2024 6:06 AM GMTబాలీవుడ్ నటి దిశాపటానీ సుపరిచితమే. అమ్మడికి నటిగా మంచి గుర్తింపు ఉంది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా దిశాపటానీ తండ్రి మోసగాళ్ల చేతిలో మోసపోయాడు. యూపీలో దిశా పటానీ తండ్రి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ. పదవి విరమణ అనంతరం ప్రభుత్వ కమీషన్ లో ఉన్నత పదువులు ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్లు ఆయన నుంచి 25 లక్షలు కాజేసారు. దీంతో జగదీశ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బరేలీ ప్రాంతానికి చెందిన జంగదీష్ పటానీ కి కొన్ని రోజుల క్రితం ఓ కామన్ ప్రెండ్ ద్వారా దివాకర్ గార్డ్, ఆచార్య జయప్రకాష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచమయ్యారు. ఇద్దరికీ రాజకీయ నాయకలుతో సంబంధాలు, పలుకుబడి ఉందని జగదీష్ ని మభ్యపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమీషన్ లో ఉన్నత పదవి ఇప్పిస్తామని అందుకోసం 25 లక్షలు ఇస్తే పనైపోతుందన్నారు. దీంతో ఆ మాటలు నమ్మిన జగదీష్ పటానీ మరో ఆలోచన లేకుండా డబ్బు ఇచ్చాడు.
డబ్బులిచ్చి మూడు నెలలు అవుతున్నా ఎలాంటి పోస్ట్ రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన జదీష్ వారిని నిలదీసారు. దీంతో ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేస్తామన్నారు. కానీ ఎన్నిసార్లు అడిగినా ఇదే తరహా సమాధానం వచ్చింది. చివరికి వారు డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసుల్ని ఆశ్రయయించి కేసు నమోదు చేసారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు.
అయితే రిడైర్డ్ ఎస్పీగా పనిచేసిన జగదీష్ పటానీ ఇలా డబ్బులివ్వడం ఏంటి? డబ్బులిచ్చి పదవి కొనుక్కోవాల నుకునే దురుద్దేశం బయట పడింది. ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపం కావడంతో అయనపై విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. అందులోనూ ఓ మాజీ పోలీస్ అధికారి మోస పోవడమే మింగుడు పడిన అంశంగా మారింది.