Begin typing your search above and press return to search.

IPL 2025ని అట్టుడికించిన దిశా ప‌టానీ

దిశా ప‌టానీ ఎక్క‌డ ఉన్నా చిట‌ప‌ట‌లు అక్కడే! వేదిక ఏదైనా కానీ, అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకుంటుంది.

By:  Tupaki Desk   |   24 March 2025 4:52 PM IST
IPL 2025ని అట్టుడికించిన దిశా ప‌టానీ
X

దిశా ప‌టానీ ఎక్క‌డ ఉన్నా చిట‌ప‌ట‌లు అక్కడే! వేదిక ఏదైనా కానీ, అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభ వేడుక కూడా దీనికి మినహాయింపు కాదు. లాంచింగ్ ఉత్స‌వంలో త‌న‌దైన గ్లామ్ షోతో దిశా అద‌ర‌గొట్టేసింది. వేదిక వ‌ద్ద‌ అద్భుత‌మైన నృత్యాల‌తో క‌వ్వించింది. ఒక ర‌కంగా జిగేల్ రాణి మెరుపుల‌తో అగ్గి రాజేసింది.


భారీ ఈవెంట్ లో దిశా గ్లామర్ షో వెబ్ ని వేడెక్కించింది. స్టేడియం ఫ్ల‌డ్ లైట్ల కింద మెరిసే షో-స్టాపింగ్ సిల్వర్ స్కర్ట్ సెట్ లో క‌నిపించింది. క్రిస్టల్ అలంకరణలు సీక్విన్‌లతో ఎంపిక చేసుకున్న దుస్తులు ఆక‌ట్టుకున్నాయి. డ్యాన్స్ ఫ్లోర్ పై దిశా ప్రతి కదలికలు ఉర్రూత‌లూగించాయి. ఈ దుస్తులలో మెరిసే రాళ్లతో పొదిగిన నెక్‌లైన్ బ్రాలెట్ సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. దిశా రూపానికి అద‌న‌పు హంగును ఇది జోడించింది. హై-వెయిస్టెడ్ మినీ స్కర్ట్ దిశా టోన్డ్ ఫిగర్‌ను హైలైట్ చేసింది.


తన అద్భుతమైన ప్రదర్శనతో ఆక‌ట్టుకున్న‌ దిశా పటాని బాలీవుడ్ టాప్ ఫ్యాషన్ ఐకాన్‌లలో ఒకర‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఐపిఎల్ 2025 ప్రారంభోత్సవంలో ఈ బ్యూటీ హై-ఆక్టేన్ గ్లామర్ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దిశా ఇటీవల యోధ, కల్కి 2898 AD, కంగువ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో క‌నిపించింది. త‌దుప‌రి `వెల్‌కమ్ టు ది జంగిల్` లాంటి భారీ చిత్రంలోను దిశా న‌టిస్తోంది.