'పాస్ట్ అండ్ ప్యూరియస్' తో దిశాపటానీ రొమాన్స్!
ప్రస్తుతానికి హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది.
By: Tupaki Desk | 21 Jan 2025 7:30 PM GMTదిశా పటానీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరోలతో పాటు సీనియర్ స్టార్లతోనూ రొమాన్స్ చేస్తూ బీజీగా ఉంది. ఇటీవలే 'కంగువ'తో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయితే సౌత్ లో మరింత బిజీ అయ్యేది. కానీ వైఫల్యం వెనక్కి నెట్టింది. అయినా అమ్మడి చేతిలో బాలీవుడ్ సినిమాలున్నాయి. ప్రస్తుతానికి హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది.
'పాస్ట్ అండ్ ప్యూరియస్' నటుడు టైరీస్ గిబ్సన్ తో ఓ వెబ్ సిరీస్ కి కమిట్ అయింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీకై నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ మెక్సికోలో జరుగుతోంది. ఇదే వెబ్ సిరీస్ లో హ్యారీ గుడ్విన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈవెబ్ సిరీస్ లో అమ్మడు దిశాపటానీ టైరీస్ తో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటిస్తోందిట.
హాలీవుడ్ వెబ్ సిరీస్ లంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. క్వాంటికో సిరీస్ తో ప్రియాకం చోప్రా ఇంటిమేట్ సన్నివేశాల్లో ఏ రేంజ్ లో చెలరేగిందో తెలిసిందే. దిశ పటానీ సైతం పీసీకి ఏమాత్రం తగ్గకుండా పెర్పార్మెన్స్ ఇస్తుందనే అంచనాలున్నాయి. హాలీవుడ్ లో ఇప్పటికే ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే, కరీనా కపూర్ లాంటి భామలు మెరిసారు. కానీ వాళ్లెవ్వరు హాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయారు. కేవలం ప్రియాంక చోప్రా మాత్రమే సక్సెస్ అయింది.
మరి పీసీ తరహాలో దిశా పటానీ నిలదొక్కుకుని నిలబడుతుందా? లేక దీపిక, ఐష్ లా వెనుదిరుగుతుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్ లో 'వెల్కమ్ టూది జంగిల్' లో నటిస్తోంది. ఇదొక ఫిల్మ్ సిరీస్. అలాగే న్యూ ఇయర్ లో మరికొన్ని హిందీ ప్రాజెక్ట్ లకు కమిట్ అయింది.