Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : లోఫర్‌ బ్యూటీ ప్లోర్‌ బ్యూటీ షో

ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈమె చేసిన ఎంఎస్‌ ధోనీ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కడంతో పాటు ఎక్కువ ఆఫర్లు దక్కాయి.

By:  Tupaki Desk   |   28 Dec 2024 1:12 PM GMT
పిక్‌టాక్ : లోఫర్‌ బ్యూటీ ప్లోర్‌ బ్యూటీ షో
X

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్‌' సినిమాతో దిశా పటానీ హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో తెలుగులో మళ్లీ ఈమెకు ఆఫర్లు రాలేదు. లక్కీగా బాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈమె చేసిన ఎంఎస్‌ ధోనీ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కడంతో పాటు ఎక్కువ ఆఫర్లు దక్కాయి. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్స్‌ సరసన నిలిచింది. అత్యధిక పారితోషికం అందుకోవడంతో పాటు, వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా పేరు సొంతం చేసుకుంది.


తెలుగులో చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో కలిసి కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో బాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యింది. సౌత్‌లో మరిన్ని సినిమాల్లో ఈమెకు నటించే ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం చాలా లైట్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఈ అమ్మడు వెల్‌కమ్‌ టు జంగిల్‌ సినిమాపై అంచనాలు పెట్టుకుంది. వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


సినిమాలతో ఏ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకుందో అదే స్థాయిలో ఈమె అందాల ఆరబోత ఫోటోలతో మంచి ఆధరణ సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 61.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన ఫోటోలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. ఫ్లోర్‌ పై క్లీ వేజ్‌ షో చేస్తూ ఆకట్టుకుంది. ఈ స్థాయిలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తున్న అమ్మడికి ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ స్థాయిలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసి చలికాలంలోనే హీట్‌ రేపుతున్న దిశా పటానీ త్వరలో తెలుగులో మరో సినిమాను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి బాలీవుడ్‌లోనే ఈమెకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. కంగువా సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే సౌత్‌లో మళ్లీ సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. ముందు ముందు అయినా ఈమెకు సౌత్‌ లో ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.